Rains in Telangana : తెలంగాణలో రాగల 2 గంటల్లో వర్షాలు

Update: 2024-08-08 05:27 GMT

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రాగల 2 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కామారెడ్డి, సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. మరోవైపు అర్ధరాత్రి హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, యూసుఫ్ గూడ, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, అత్తాపూర్, టోలిచౌకి ఏరియాల్లో వాన దంచికొట్టింది. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. నిన్న గద్వాల జిల్లా గట్టులో అత్యధికంగా 12.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అటు భద్రాచలం సైతం నీటమునిగింది. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం,కామారెడ్డి, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అన్ని జిల్లాల్లో కురుస్తాయని పేర్కొంది.

Tags:    

Similar News