రానున్న మూడురోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర గుజరాత్ మీదుగా ఉపరితల ఆవర్తం నుంచి వాయువ్య బంగాళాఖాతం, ఆనుకొని ఉన్న పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్ ఘడ్, ఉత్తర ఒడిశా మీదుగా ఉపరితల ఆవర్తనం వరకు కొనసాగుతోందని తెలిపింది. సముద్రమట్టానికి సగటున 3.1 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని.. ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశగా వంగి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో మూడురోజులు వానలు కొనసాగు తాయని వివరిం చింది. సోమవారం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని చెప్పింది. మంగళవారం పెద్దపల్లి, భూపాల పల్లి, ములుగు, కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండలో బలమైన ఈదురుగాలులతో కూడిన వానలు కొనసాగుతాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది.