రగిలే ఎండలతో సతమతం అవుతున్న తెలంగాణకు అకస్మాత్తు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. క్యుములోనింబస్ మేఘాల ప్రభావం తెలంగాణపై ఇవాళ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు తీవ్రమైన వేడికి చివరి రోజు అని క్లారిటీ ఇచ్చింది.
సాయంత్రం - రాత్రి సమయంలో పశ్చిమ, మధ్య, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని సూచించింది. రాత్రి టైంలో బలమైన గాలులు వీస్తాయని, వడగళ్లు పడతాయని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. హైదరాబాద్ సిటీకి కూడా రెయిన్ అలర్ట్ జారీచేసింది ఐఎండీ. ఈ సాయంత్రం పశ్చిమ, ఉత్తర హైదరాబాద్ లో బలమైన గాలులతో వర్షం పడుతుందని తెలిపింది.