ఇంటింటి సమగ్ర సర్వేపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా మండిపడ్డారు. మూసీ పేరుతో అనవసర ఖర్చులు పెడుతున్నారని విమర్శించారు. గతంలో కేసీఆర్ సర్వే పేరుతో హంగామా చేశారని… ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పనిచేస్తోందని విమర్శించారు. అలాగే సర్వేకి వచ్చేవారిలో మైనార్టీ ఎన్యుమరేటర్లను హిందువుల ఇళ్లకి పంపవద్దని సూచించారు. మైనార్టీలు వస్తే హిందువులు ఎవరూ సహకరించరన్నారు. ప్రభుత్వ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తామని అయితే హిందువుల బూత్‌లలో హిందువులను మాత్రమే పంపాలని స్పష్టం చేశారు.