Prakash Raj : టీఆర్ఎస్ నుంచి ప్రకాష్ రాజ్ కి రాజ్యసభ సీటు?

Prakash Raj : తెలంగాణ CM కేసీఆర్‌ నిర్ణయాలన్నీ అనూహ్యంగానే ఉంటాయ్‌. ఎవర్ని ఎప్పుడు దగ్గరకు తీసుకుంటారు.

Update: 2022-02-22 04:30 GMT

prakash Raj : తెలంగాణ CM కేసీఆర్‌ నిర్ణయాలన్నీ అనూహ్యంగానే ఉంటాయ్‌. ఎవర్ని ఎప్పుడు దగ్గరకు తీసుకుంటారు.. ఎవరికి ఎప్పుడు ప్రాధాన్యం ఇస్తారు అనే విషయంలో ప్రతిదానికీ పక్కా లెక్క ఉంటుంది. తాజాగా జాతీయ రాజకీయాల్లో కీ రోల్‌ పోషించాలని డిసైడేన వేళ ఆయన నేషనల్‌ టీమ్‌లో ప్రకాష్‌ రాజ్‌ వచ్చి చేరడం అందర్లో ఆసక్తి రేపుతోంది. ఉన్నట్టుండి ప్రకాష్‌ రాజే ఎందుకు కావాల్సి వచ్చాడు..? ఆయన్ను వెంటపెట్టుకోవడం ద్వారా KCR ఆశిస్తోంది ఏంటనేదానిపై ఎవరి వాదన వాళ్లు వినిపిస్తున్నారు. ప్రకాష్‌ రాజ్‌ BJP అంటేనే ఇంతెత్తున లేస్తారు.

కర్నాటకలో కొన్నేళ్ల కిందట గౌరీలంకేష్‌ హత్యతో కాషాయదళంతో ఆయనకు ఘర్షణ మొదలైంది. అప్పటి నుంచి 'జస్ట్‌ ఆస్కింగ్‌' అంటూనే BJPపై ఓ రేంజ్‌లో ఫైరైపోతున్నారు. పైగా ఆయనకు జాతీయ రాజకీయాలపై మంచి అవగాహనే ఉంది. అదే సమయంలో ఆయన ఇటు దక్షిణాదిలోనూ అందరితో సత్సంబంధాలున్న వ్యక్తి. హిందీ, ఇంగ్లీష్‌తోపాటు సౌత్‌ లాంగేజెస్ అన్నీ మాట్లాడగలరు. ఇలాంటి ప్లస్‌లే KCR టీమ్‌లో ప్రకాష్‌రాజ్‌కి చోటు దక్కడానికి కారణమంటున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే ఆయనకు రాజ్యసభ ఇస్తారని ప్రచారం మొదలవడం ఇంకో ఎత్తనే చెప్పాలి.

TRS నుంచి రాజ్యసభలో 2 ఖాళీలు అవుతున్నాయి. ఒకటి DS, మరొకటి కెప్టన్ లక్మీకాంత్‌రావు. ఇద్దరూ జూన్‌లో పదవీవిరమణ చేస్తారు. అలాగే బండ ప్రకాష్‌ రాజీనామా చేసి MLCగా వచ్చిన నేపథ్యంలో అది కూడా ఖాళీగానే ఉంది. త్వరలో ఈ మూడు స్థానాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేసే క్రమంలో ప్రకాష్‌రాజ్‌కు చోటు దక్కుతుందనే మాట వినిపిస్తోంది. ఇకపైన కూడా కేసీఆర్‌ జాతీయ టూర్లలో ప్రకాష్‌ రాజ్‌ ఉంటారని కూడా చెప్తున్నారు. కర్నాటకలో దేవెగౌడ లాంటి వాళ్లతోను, తమిళనాడులో స్టాలిన్ లాంటి వాళ్లతోనూ ప్రకాష్‌రాజ్‌కి సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో అవసరాలకు తగ్గట్టు కూటమి ప్రయత్నాల్లో ఉపయోగం ఉంటుందని గులాబీశ్రేణులు భావిస్తున్నాయి.

అప్పట్లో ఫెడరల్ ఫ్రంట్‌ చర్చలు జరిపినప్పుడు దేవెగౌడతో కలిసే సందర్భంలోనూ KCRకి-దేవెగౌడకి మధ్య ప్రకాష్‌రాజ్‌ ఉన్నారనే మాట కూాడా వినిపించింది. మా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా ఆయనకు TRS మద్దతు ఇచ్చిందనేది తెలిసిందే. ఇద్దరి మధ్య భావజాలంలో చాలా సారూప్యత ఉన్నందునే.. KCR ముంబైకి వెళ్తూ ప్రకాష్‌రాజ్‌ను పిలిపించారనే ప్రచారం జరుగుతోది. BJP మాత్రం KCR ప్రకాష్‌రాజ్‌తో రాసుకుపూసుకు తిరగడం సహించలేకపోతోంది. బండి సంజయ్ మొదలు ప్రతి నాయకుడూ ప్రకాష్‌రాజ్‌తో కలవడం ద్రోహమన్నట్టుగానే విరురుచుకుపడుతున్నారు.

Tags:    

Similar News