rakhi:అనురాగం, ఆత్మీయత అంతా ఓ బూటకం
అన్న వైఎస్ జగన్కు రాఖీ కట్టని వైఎస్ షర్మిల... కేటీఆర్కు రాఖీ కట్టని కల్వకుంట్ల కవిత.. కవిత రాఖీ కడుతుందనే హైద్రాబాద్లో లేని కేటీఆర్..! వ్యక్తిగత జీవితాలను ప్రభావితం చేస్తున్న రాజకీయ వైరం;
రాజకీయాలు వేరు, వ్యక్తిగత సంబంధాలు లేవు. రాజకీయంగా తీవ్ర విమర్శలు చేసుకుని ఎదుట పడితే ఆత్మీయంగా ఉండే రాజకీయ నేతలు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు. అలాగే కుటుంబసభ్యులు వేర్వేరు పార్టీల్లో ఉన్నా.. తమ వ్యక్తిగత సంబంధాలను మాత్రం వదులుకోరు. వేర్వేరు పార్టీల్లో ఉన్న నందమూరి బాలకృష్ణ, పురందేశ్వరి రక్షా బంధన్ జరుపుతున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాలకృష్ణ టీడీపీలో ఎమ్మెల్యేగా ఉంటే.. పురందేశ్వరి బీజేపీలో ఎంపీగా ఉన్నారు. అయితే కొంత మంది రాజకీయ నేతలు మాత్రం ఈ గీతను చెరిపేసుకున్నారు. వ్యక్తిగత జీవితంలో రాజకీయాలను కలిపేసుకుని తమకు వ్యతిరేకిస్తున్న కుటుంబసభ్యులను దూరం చేసుకున్నారు. వైఎస్ జగన్ జైలులో ఉన్నప్పుడు వైఎస్ షర్మిల రెండు తెలుగురాష్ట్రాల్లో మూడు వేల కిలోమీటర్ల వరకూ పాదయాత్ర చేశారు. అయితే ఆమెకు పార్టీలో ఎలాంటి పదవి ఇవ్వలేదు. అలాగే ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవి ఇవ్వలేదు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. తనపైనే రాజకీయాలు చేస్తుందా అన్న కోపంతో జగన్ ఆమెతో మాట్లాడటం మానేశారు. ఎంతగా అంటే.. చివరికి షర్మిల కుమారుడు.. అంటే మేనల్లుడు పెళ్లికి కూడా జగన్ వెళ్లలేదు. ఎప్పుడైనా ఇంటికి పిలిచి కొత్తబట్టలు పెట్టడం సంప్రదాయాలను కూడా పాటించలేదు. ఇద్దరి మధ్య ముఖాలు కూడా చూసుకోనంత దూరం పెరిగింది. గతంలో రాఖీ పండుగ వద్ద అన్నా, చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని వైసీపీకి చెందిన నేతలు, మీడియా హైలెట్ చేసేది. ఇప్పుడు షర్మిల ప్రస్తావన కూడా రావడం లేదు. రాజకీయం పూర్తిగా వ్యక్తిగతంగా తీసుకోవడం వల్ల.. వారి మధ్య దూరం పెరిగింది. ప్రాంతీయ పార్టీల్లో కుటుంబాల ఆధిపత్యం ఉంటుంది. ఆ కుటుంబాల్లో విబేధాలు వస్తే పార్టీలపైనే ప్రభావం పడుతుంది.
కేటీఆర్, కవిత మధ్య దూరం
బీఆర్ఎస్ వారసులు అయిన కేటీఆర్, కవిత మధ్య కూడా ఇటీవలి కాలంలో పొసగడం లేదు. వ్యక్తిగత సంబంధాలు బాగుండాలి. కానీ రాజకీయంగా కవిత తీసుకున్న నిర్ణయంతో కేటీఆర్ .. కవిత విషయంలో అంత సానుకూలంగా లేరు. ఇటీవల కేటీఆర్ పుట్టిన రోజు నాడు కవిత సోషల్ మీడియాలో హ్యాపీ బర్త్ డే కేటీఆర్ అన్నా అని ఆప్యాయంగా ట్వీట్ పెట్టారు. కానీ కేటీఆర్ నుంచి రిప్లయ్ లేదు. రాఖీ పండుగ రోజు.. కవిత వచ్చి రాఖీ కడతారేమో అన్న ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి వెళ్లిపోయారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ కూడా వ్యక్తిగత , కుటుంబ అంశాలకు రాజకీయాన్ని కలుపుకోవడంతో గ్యాప్ వచ్చేసింది. బీఆర్ఎస్, వైసీపీల మధ్య అదే సారూప్యత కనిపిస్తోంది. ఆ పార్టీలో ఇద్దరు కీలక నేతలు చెల్లెళ్లను దూరం పెట్టడం వల్ల గందరగోళం పరిస్థితులు ఏర్పడ్డాయి. వైసీపీ అధినేతకు పోటీగా షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి బాధ్యతలు తీసుకున్నారు. కవిత, షర్మిలతో వైరం ఈ రెండు పార్టీలను ఎంత నష్టం కలిగిస్తుందో భవిష్యత్తులో తేలనుంది.