Telangana : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావు

Update: 2025-07-01 10:45 GMT

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగారాంచందర్ రావు ఎన్నికైనట్లు కేంద్ర మంత్రి, ఎన్నికల అధికారి శోభాకరందాజే ప్రకటించా రు. మన్నెగూడలోని ఓ కన్వేన్షన్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రాంచందర్ రావును అధ్యక్షుడిగా ప్రకటించడంతో పాటు ఆయనకు నియామక పత్రం అందించారామె. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాంచందర్ రావుకు పార్టీ పతాకాన్ని అందించారు. ఈ క్రమంలో ఆయన కిషన్ రెడ్డి నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా బా ధ్యతలు స్వీకరించారు. రాంచందర్ రావుకు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం శోభ కరంగ్లాజె మాట్లాడుతూ.. 'ఏకగ్రీవంగా ఎన్నిక పూర్తి అవ్వడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ. భారీగా సభ్యత్వాలు నమోదు చేయడం వల్ల ఈస్థాయికి చేరుకున్నాం. ఇది చాలా గర్వించదగిన విషయం. బీఆర్ఎస్ తో తెలంగాణ ప్రజలు నారాజ్ అయ్యారు. ఆ పార్టీని ఓడించి ఇంటికి పంపించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కేవలం ఏడా దిన్నర కాలంలోనే విమర్శలు మూటగట్టుకుం ది. తెలంగాణలో ఇప్పుడు అంతా బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీ తెలంగాణలో వచ్చేందుకు ఇదే మంచి అవకాశం. ప్రతి జిల్లా, గ్రామస్థాయి వరకు కార్యకర్తలు పర్యటించాలి. మాజీ ప్రధాని మన్మోహన్ విదేశీ పర్యటనకు వెళ్తే కనీసం ఎవరూ నమస్కరించని పరిస్థితి ఉండేది. ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారు కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ఏటీఎం సర్కార్ లు ఉన్నాయి. 2028 లో తెలం గాణలో అధికారంలోకి రావాలి. రామచంద్ర రావు 40 ఏండ్లు పార్టీకి కష్టపడి పనిచేశారు.. కానీ పదవులు ఆశించలేదు. ఒక ఎమ్మెల్సీగా మాత్రమే ఆయన కొనసాగారు. ఇప్పుడు పార్టీ ఆయనకు ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పగిం చింది' అని చెప్పారు.

Tags:    

Similar News