రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కెళ్లపల్లి సర్పంచ్ అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. రియల్టర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అక్రమ వెంచర్లకు ఓకే చెపుదామని గ్రామ పంచాయతీ సాధారణ సమావేశంలో బీఆర్‌ఎస్ సర్పంచ్ కంబాలపల్లి సంతోష ఓపెన్‌గా చెప్పారు. పంచాయతీ కార్యదర్శి,వార్డు సభ్యుల ముందే తెగేసి చెప్పింది ఆమె. అయితే సర్పంచ్ అక్రమాలను నిలదీస్తున్నారు వార్డు సభ్యులు. గతంలో కూడా ఆమెపై అనేక ఆరోపణలు వచ్చాయని.. సర్పంచ్ ముసుగులో అనేక అక్రమ దందాలు చేశారని విమర్శిస్తున్నారు తక్కెళ్లపల్లి పంచాయతీ వార్డు మెంబర్లు.