REVANTH: రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నించింది

ముఖ్యమంత్రి రేవంత్ సంచలన వ్యాఖ్యలు... పేదలపై కక్షగట్టి పథకాన్నే మారుస్తారా..?.. మెజార్టీ ఉందని ఇష్టారీతిన వ్యవహరిస్తే ఊరుకోం.. ప్రజావ్యతిరేక విధానాలను సహించేదే లేదన్న సీఎం

Update: 2026-01-09 03:00 GMT

పే­ద­ల­పై కక్ష­తో మహా­త్మా­గాం­ధీ జా­తీయ ఉపా­ధి హామీ పథ­కా­న్నే మా­రు­స్తా­రా? అని తె­లం­గాణ సీఎం రే­వం­త్‌­రె­డ్డి ( ప్ర­శ్నిం­చా­రు. ని­బం­ధ­నల మా­ర్పు ము­సు­గు­లో పథ­కా­న్ని శా­శ్వ­తం­గా సమా­ధి చే­య­డా­ని­కి కు­ట్ర చే­స్తు­న్నా­ర­న్నా­రు. గాం­ధీ­భ­వ­న్‌­లో ని­ర్వ­హిం­చిన పీ­సీ­సీ వి­స్తృ­త­స్థా­యి సమా­వే­శం­లో ఆయన మా­ట్లా­డా­రు. ఈ సమా­వే­శం­లో టీ­పీ­సీ­సీ అధ్య­క్షు­డు మహే­శ్‌ కు­మా­ర్‌ గౌడ్ పా­ల్గొ­న్నా­రు. ‘‘అధి­కా­రం ఉం­ద­ని మోదీ ప్ర­భు­త్వం ఇష్టా­రీ­తిన వ్య­వ­హ­రి­స్తా­మం­టే అం­గీ­క­రిం­చం. మె­జా­రి­టీ ఉం­ద­ని చట్ట­స­భ­ల­ను వి­ని­యో­గిం­చి పే­ద­ల­ను అణ­చి­వే­స్తా­మం­టే కు­ద­ర­దు. ఉపా­ధి హామీ పథ­కా­న్ని ని­ర్వీ­ర్యం చేసే కు­ట్ర­ను అడ్డు­కో­వా­ల్సిన సమ­య­మి­ది. ఈ పథ­కం­తో ఎన్నో వి­ప్ల­వా­త్మక మా­ర్పు­లు వచ్చా­యి. ఇది ప్ర­పం­చ­వ్యా­ప్తం­గా గు­ర్తిం­పు పొం­దిం­ది.

2024 ఎన్ని­క­ల్లో 400 సీ­ట్లు ఇవ్వా­ల­ని భా­జ­పా నే­త­లు ప్ర­చా­రం చే­శా­రు. అన్ని సీ­ట్లు వచ్చి ఉంటే రా­జ్యాం­గా­న్నే మా­ర్చే­సే­వా­రు. తద్వా­రా పేదల హక్కు­ల­ను కా­ల­రా­యా­ల­ని చూ­శా­రు. కా­ర్పొ­రే­ట్ల­కు దే­శా­న్ని అప్ప­గిం­చే ప్ర­య­త్నం చే­శా­రు. ప్ర­జ­ల­ను కాం­గ్రె­స్‌ అప్ర­మ­త్తం చే­య­డం­తో భా­జ­పా 240 సీ­ట్ల వద్ద ఆగి­పో­యిం­ది. దీం­తో రా­జ్యాం­గా­న్ని మా­ర్చా­ల­నే ఆలో­చన వా­యి­దా పడిం­ది. ఓట్ల­ను తొ­ల­గిం­చేం­దు­కు ఎస్‌­ఐ­ఆ­ర్‌ తీ­సు­కొ­చ్చా­రు. దీని వె­నుక పె­ద్ద కు­ట్ర ఉంది’’ అని రే­వం­త్‌­రె­డ్డి అన్నా­రు. సీఎం రే­వం­త్ రె­డ్డి తొ­మ్మి­ది జి­ల్లా­ల్లో బహి­రంగ సభలు ని­ర్వ­హిం­చ­ను­న్నా­రు. ఫి­బ్ర­వ­రి 3 నుం­చి 9 వరకు జి­ల్లా­ల్లో ని­ర్వ­హిం­చే సభ­ల్లో పా­ల్గొం­టా­రు. ఫి­బ్ర­వ­రి 3న మహ­బూ­బ్‌­న­గ­ర్‌­లో సీఎం రే­వం­త్ తొలి బహి­రంగ సభ జర­గ­నుం­ది. 

 మోడీని వదిలేది లేదు

ప్ర­పంచ వ్యా­ప్తం­గా గు­ర్తిం­పు పొం­దిన ఉపా­ధి హామీ పథ­కా­న్ని ని­ర్వీ­ర్యం చే­సేం­దు­కు మోడీ ప్ర­భు­త్వం ప్ర­య­త్ని­స్తోం­ద­ని రే­వం­త్ రె­డ్డి వి­మ­ర్శిం­చా­రు. ఉపా­ధి హా­మీ­తో ఎన్నో వి­ప్ల­వా­త్మక మా­ర్పు­లొ­చ్చా­య­ని కానీ అధి­కా­రం ఉం­ద­ని మోడీ సర్కా­ర్ ఇష్టా­రీ­తిన వ్య­వ­హ­రి­స్తోం­ద­న్నా­రు. గత సా­ర్వ­త్రిక ఎన్ని­క­ల్లో 400 సీ­ట్లు వస్తే రా­జ్యాం­గా­న్ని తమకు అను­కూ­లం­గా మా­ర్చు­దా­మ­ని బీ­జే­పీ ప్ర­ణా­ళి­క­లు చే­సిం­ది. కానీ ఆశిం­చి­న­న్ని స్థా­నా­లు రా­క­పో­వ­డం­తో రా­జ్యాం­గా­న్ని మా­ర్చ­లే­క­పో­యా­రు. దీం­తో వేరే రూ­పం­లో ప్ర­జల హక్కు­ల­ను కా­ల­రా­సేం­దు­కు బీ­జే­పీ ప్ర­య­త్ని­స్తోం­ద­న్నా­రు. ఈ దే­శం­లో ఇళ్లు, ఆస్తి లేని వా­రి­కి ఓటు హక్కు ఒక్క­టే ఆయు­ధం అని ఈ హక్కు­ను తొ­ల­గా­ల­నే ఎస్ఐ­ఆ­ర్ తీ­సు­కు­వ­చ్చా­ర­న్నా­రు. ఓటు హక్కు తీ­సే­స్తే ఆధా­ర్ కా­ర్డు, రే­ష­న్ కా­ర్డు, ప్ర­భు­త్వ సం­క్షేమ పథ­కా­లు ఆగి­పో­తా­య­న్నా­రు. చి­వ­ర­కు ఈ దే­శం­లో ఉం­డా­లా లేదా అనే ని­ర్ణ­యం బీ­జే­పీ చే­తి­లో­కి వె­ళ్తుం­ద­న్నా­రు. ఈ దే­శం­లో వె­ట్టి­చా­కి­రి­ని తి­రి­గి తీ­సు­కు­వ­చ్చేం­దు­కు బీ­జే­పీ ఎస్ఐ­ఆ­ర్ ద్వా­రా ప్ర­య­త్ని­స్తోం­ద­న్నా­రు. అదా­నీ, అం­బా­నీ­ల­కు తక్కువ ధరకు కూ­లీ­లు దొ­ర­క­డం లే­ద­ని ఉపా­ధి పథ­కా­న్ని మా­రు­స్తు­న్నా­రు. ఇది కా­ర్పొ­రే­ట్ కం­పె­నీల కు­ట్ర అని దీ­న్ని నరేం­ద్ర మోడీ ప్ర­భు­త్వం అమలు చే­స్తు­న్న­ద­న్నా­రు.

Tags:    

Similar News