REVANTH: హైదరాబాద్‌కు బుల్లెట్ రైలు: సీఎం రేవంత్
కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదనలు
తెలంగాణలో రవాణా, అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. త్వరలో హైదరాబాద్‌లో మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని తెలిపారు. హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని రేవంత్ తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన ఓ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. 2047 నాటికి తెలంగాణ ప్రాధాన్యత రంగాలను వివరించారు. రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి ప్రైవేటు రంగం మద్దతు గురించి తెలిపారు. అభివృద్ధి కోసం ‘తెలంగాణ రైజింగ్ 2047’ రూపొందించుకున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. హైదరాబాద్, బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు ఏర్పాటు చేస్తామని, ఔటర్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా రీజినల్ రింగ్ రోడ్డును అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఫార్మా, ఇతర రంగాలకు రోడ్‌మ్యాప్‌లు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో పాల్గొని, హైదరాబాద్ నగరం భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ఫ్యూచర్‌సిటీని నిర్మిస్తున్నాం. విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తాం.
కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదనలు
హైదరాబాద్-బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తాం. డ్రగ్స్ కట్టడిలో మా రాష్ట్ర పోలీసులు దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్నారు. 2034 కల్లా ట్రిలియన్ డాలర్ల, 2047 కల్లా మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారాలనేది మా లక్ష్యం. దేశ జీడీపీలో 10 శాతం తెలంగాణ నుంచే రావాలనేది మా ధ్యేయం’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు. . ' తెలంగాణ రైజింగ్ 2047 ' అనే లక్ష్యంతో, రాబోయే 20 ఏళ్ళలో తెలంగాణను ఒక అభివృద్ధి చెందిన.. సుస్థిర రాష్ట్రంగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌కు ఒకప్పుడు జీవనదిగా ఉన్న మూసీ నదిని తిరిగి పునరుద్ధరించడానికి ప్రభుత్వం నిబద్ధతతో ఉంది. గుజరాత్‌లోని సబర్మతి తీరంలా మూసీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మూసీ రివర్‌ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా, కాలుష్య కారక పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించి, పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నారు.