REVANTH: "ఢిల్లీ మోడీ అయినా..గల్లీ కేడీ అయినా.. మేం రెడీ"

Update: 2025-07-05 03:00 GMT

ఢి­ల్లీ­లో ఉండే మోడీ అయి­నా, గల్లీ­లో­ని కేడీ అయి­నా.. రైతు సం­క్షే­మం వి­ష­యం­లో తే­ల్చు­కు­నేం­దు­కు రా­వా­లం­టూ తె­లం­గాణ సీఎం రే­వం­త్ రె­డ్డి సవా­ల్ వి­సి­రా­రు. ఈ క్ర­మం­లో బీ­ఆ­ర్ఎ­స్, బీ­జే­పీ నే­త­ల­పై రే­వం­త్‌ వి­మ­ర్శ­లు గు­ప్పిం­చా­రు. కే­వ­లం 9 రో­జు­ల్లో రూ.9వేల కో­ట్ల­ను రై­తుల ఖా­తా­ల్లో జమ చేసి, వ్య­వ­సా­యా­న్ని దం­డుగ నుం­చి పం­డు­గ­గా మా­ర్చిన ఘనత తమ­దం­టూ రే­వం­త్ రె­డ్డి గర్వం­గా చె­ప్పు­కొ­చ్చా­రు. 24 గంటల ఉచిత కరెం­ట్, రుణ మాఫీ సహా రైతు సం­క్షే­మం కోసం అనేక పథ­కా­ల­ను అమలు చేసి తె­లం­గాణ వ్య­వ­సాయ రం­గా­న్ని బలో­పే­తం చే­సి­న­ట్లు తె­లి­పా­రు. . హై­ద­రా­బా­ద్‌ ఎల్బీ స్టే­డి­యం­లో జరు­గు­తు­న్న సా­మా­జిక న్యాయ విజయ భేరి సభలో ప్ర­స­గిం­చిన సీఎం... తె­లం­గాణ ప్ర­తి­ప­క్షా­ల­పై తీ­వ్ర వి­మ­ర్శ­లు చే­శా­రు.

ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు

తమ ప్ర­భు­త్వం అధి­కా­రం­లో­కి వచ్చిన తర్వాత ఉద్యోగ ని­యా­మ­కా­ల­కు ప్రా­ధా­న్యత ఇచ్చిం­ద­ని స్ప­ష్టం చే­శా­రు. తమ ప్ర­భు­త్వం కే­వ­లం ఏడా­ది కా­లం­లో­నే 60,000 ప్ర­భు­త్వ ఉద్యోగ ని­యా­మ­కా­ల­ను పూ­ర్తి చే­సిం­ద­ని ఆయన వె­ల్ల­డిం­చా­రు. ఈ లె­క్క­ల్లో ఏమై­నా తేడా ఉంటే.. నేను క్ష­మా­ప­ణ­లు చె­ప్ప­డా­ని­కై­నా సి­ద్ధం అని బీ­జే­పీ, బీ­ఆ­ర్ఎ­స్ నా­య­కు­ల­కు సవా­ల్ వి­సి­రా­రు. సీఎం మా­ట్లా­డు­తూ.. గత పా­ల­కుల 'దొ­రల గడీ­'­కి తె­ర­దిం­చి.. ప్ర­జ­ల­కు అం­డ­గా ని­లి­చా­మ­ని, తమ పాలన మూ­ణ్నా­ళ్ల ము­చ్చ­టే అని గతం­లో ఎగ­తా­ళి చే­సిన వా­రి­కి, నేడు వి­జ­య­వం­త­మైన ప్ర­జా పాలన, సం­క్షేమ కా­ర్య­క్ర­మాల అమ­లు­తో సమా­ధా­నం చె­బు­తు­న్నా­మ­ని ఆయన ఉద్ఘా­టిం­చా­రు. తాము ఎక్కడ వి­ఫ­లం అవు­తా­మా అని ఎదు­రు­చూ­స్తు­న్న ప్ర­తి­ప­క్షా­ల­కు చెం­ప­పె­ట్టు­లా, కే­వ­లం తొ­మ్మి­ది రో­జు­ల్లో­నే రైతు భరో­సా పథకం కింద రూ.9,000 కో­ట్ల­ను 70 లక్షల మంది రై­తు­ల­కు అం­దిం­చా­మ­ని పే­ర్కొ­న్నా­రు.

చర్చకు సిద్ధం

" రైతు రా­జ్యం ఎవ­రి­దో పా­ర్ల­మెం­ట్ లేదా అసెం­బ్లీ­లో చర్చ పె­డ­దాం. మోదీ వస్తా­రో? కే­సీ­ఆ­ర్ వస్తా­రో రండి.. మేం చర్చ­కు సి­ద్ధం. రైతు భరో­సా వి­ఫ­ల­మ­వు­తుం­ద­ని గొ­తి­కాడ నక్క­ల్లా కొం­ద­రు ఎదు­రు­చూ­శా­రు. కానీ 9 రో­జు­ల్లో రైతు భరో­సా ని­ధు­లు రై­తుల ఖా­తా­ల్లో జమ­చే­శాం. కో­టి­మం­ది ఆడ­బి­డ్డ­ల­ను కో­టీ­శ్వ­రు­ల­ను చే­య­డ­మే మా లక్ష్యం. పే­ద­ల­కు సొంత ఇళ్లు, సొంత భూమి ఉం­దం­టే అది ఇం­ది­ర­మ్మ ఇచ్చిం­దే’ అని చె­ప్పా­రు. ‘పథ­కా­ల­కు ఇం­ది­ర­మ్మ పేరు పె­డి­తే కొం­ద­రు రా­ద్ధాం­తం చే­స్తు­న్నా­రు. అలాం­టి వా­రి­ని గు­డ్డ­లూ­డ­దీ­సి కొ­డి­తే కానీ బు­ద్ధి రాదు. అలాం­టి వా­రి­కి బు­ద్ధి చె­బి­తే కానీ ఇం­ది­ర­మ్మ గొ­ప్ప­ద­నం తె­లి­య­దు. సో­ష­ల్ మీ­డి­యా­లో మన కా­ర్య­క­ర్త­లు యు­ద్ధం ప్ర­క­టిం­చా­లి. ఈ యు­ద్ధం­లో కల్వ­కుం­ట్ల గడీ తు­నా­తు­న­క­లు కా­వా­లి. స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల్లో కా­ర్య­క­ర్త­ల­ను గె­లి­పిం­చు­కు­నే బా­ధ్యత నాది’ అని సీఎం రే­వం­త్ రె­డ్డి వ్యా­ఖ్యా­నిం­చా­రు. గత ప్ర­భు­త్వ నా­య­కు­లు రై­తు­లు వరి వే­స్తే ఉరి వే­సు­కో­వా­ల­ని బె­ది­రిం­చా­ర­ని, తమ ప్ర­భు­త్వం వరి పం­డిం­చిన రై­తు­ల­కు బో­న­స్‌­లు ఇచ్చి.. ‘రైతే రాజు’ అనే మా­ట­ను నిజం చే­స్తోం­ద­ని రే­వం­త్ గు­ర్తు చే­శా­రు. సం­క్షేమ పథ­కా­ల­లో మహి­ళ­ల­కే పె­ద్ద పీట వే­స్తా­మ­ని హామీ ఇచ్చా­రు.

Tags:    

Similar News