REVANTH: మొంథా తుఫాన్‌తో రైతులు నష్టపోవద్దు: సీఎం రేవంత్
అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు
మొంథా తుపాను నేపథ్యంలో ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రైతులకు నష్టం జరగకుండా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.పంట ఉత్పత్తులు కొనుగోలు కేంద్రాలకు వస్తున్నందున వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, రైతులకు అన్నివిధాలా సహకరించాలన్నారు. జిల్లా కలెక్టర్లు, సంబంధిత ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని మంత్రులు ఉత్తమ్, తుమ్మలకు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురవడంతో పాటు ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది. మంగళవారం పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం ఈ జిల్లాలతో పాటు ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల 10 సెం.మీ.కుపైగా వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మరోపక్క మంగళ, బుధవారాల్లో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రాష్ట్రంలో తుపాను పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. మంత్రులు ఉత్తమ్, తుమ్మలతో మాట్లాడారు.
తుఫాన్ ప్రభావంపై ఉత్తమ్ సమీక్ష
మొంథా తుపాన్ ప్రభావంపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తుపాన్ ప్రభావం సమీక్షా సమావేశం నిర్వహించారు. జరిగింది. తెలంగాణ రాష్ట్రంపై తుపాన్ ప్రభావం ఏ మేరకు ఉంటుందనే విషయం గురించి చర్చ జరిగింది. అలాగే తుపాన్ ప్రభావం కారణంగా ధాన్యం కొనుగోళ్లకు ఆటంకం లేకుండా చూడాలని అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. టార్పాలిన్లను వినియోగించి ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 8,342 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. వీటిల్లో ఇప్పటికే 4,428 కేంద్రాలు ప్రారంభం అయ్యాయని.. మిగిలినవి త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటివరకూ 22,433మంది రైతుల నుంచి 1.80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటివరకూ కొనుగోలు చేసిన ధాన్యం విలువ దాదాపు రూ.431.09 కోట్లు ఉంటుందని తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.