రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించే వరకూ పోరాడతామ ని మాజీ మంత్రి కేటీఆర్అన్నారు. ప్రభుత్వం లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లగచర్ల బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్ ఆధ్వర్యం లో మహబూబాబాద్ లో నిర్వహిస్తున్న మహా ధర్నాలో ఆయన మాట్లాడారు. 'లగచర్లలో దళిత, గిరిజన రైతులు 9 నెలలుగా ఆందోళన చేస్తున్నరు. వారితో మాట్లాడేందుకు సీఎం రేవంత్ సమయం ఇవ్వలేదు. కానీ ఢిల్లీకి మాత్రం క్యూ కడుతున్నరు. సీఎం సొంత ని యోజకవర్గంలోనే తిరుగుబాటు ఎదుర్కొం టున్నరు. సొంత అల్లుడి కోసం సీఎం రేవంత్ పేరుతో భూములు లక్కుంటున్నరు. అదానీ, అల్లుడు, అన్నదమ్ముళ్ల కోసమే పనిచేస్తున్న డు. ఆయనకు మహారాష్ట్ర ప్రజలు కూడా బుద్ధి చెప్పారు. నన్ను రాళ్లతో కొడతారని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నరు. మరి వారిపై పోలీసులు ఎందుకు కేసులు పెట్టట్లేదు. గతంలో మానుకోట రాళ్ల దాడి నుంచి నిప్పు పుట్టింది. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా, అన్ని పడుతుండే.. ఇప్పుడు అన్ని బోగస్ గా మార్చిండు. మీరు అనుమతి ఇవ్వ కపోతే కోర్టు నుంచి అనుమతి తెచ్చుకొని వేల మందితో ధర్నాకు కూర్చున్నం. రాష్ట్రవ్యాప్తం గా ఎవరికి అన్యాయం జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదు. గిరిజనులకు ఆరు శాతం రిజర్వే షన్ లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? కొత్త నియంత రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు మానుకోట గడ్డ సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభు త్వానికి వ్యతిరేకంగా మద్దతు కూడకడుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తం 'అని తెలిపారు.