REVANTH: కవితను కాంగ్రెస్ పార్టీలోకి రానివ్వను

కవిత కల్లోలం వారి కుటుంబ వ్యవహారం... ఓ ఆడబిడ్డపై నలుగురు దాడి చేస్తున్నారు... గతంలో తెలంగాణలో ట్రంప్ ఉండేవాడు

Update: 2025-09-20 04:00 GMT

కే­సీ­ఆ­ర్, కే­టీ­ఆ­ర్, హరీ­ష్ రావు, సం­తో­ష్ రావు కలి­సి ఒక ఆడ­పి­ల్ల (కవిత)పై దాడి చే­యా­ల­ని చూ­స్తు­న్నా­ర­ని రే­వం­త్ రె­డ్డి ఆరో­పిం­చా­రు. ఇది వారి కు­టుంబ సమ­స్య అని, దీ­ని­కి తనకు ఎలాం­టి సం­బం­ధం లే­ద­ని స్ప­ష్టం చే­శా­రు. “నేను ఎక్క­డా కవి­త­కు సపో­ర్ట్ చే­య­డం లేదు. ఇది వారి ఇంటి సమ­స్య. ఆస్తి తగా­దాల వల్ల వారి కు­టుంబ సమ­స్య­లు బజా­రున పడ్డా­యి. ప్ర­జ­లు కే­సీ­ఆ­ర్ కు­టుం­బా­న్ని తి­ర­స్క­రిం­చా­రు. ఆ నలు­గు­రి­ని తె­లం­గాణ ప్ర­జ­లు బహి­ష్క­రిం­చా­రు” అని రే­వం­త్ రె­డ్డి అన్నా­రు. కల్వ­కుం­ట్ల కవిత వ్య­వ­హా­రం .. వారి కు­టుంబ సమ­స్య అని రే­వం­త్ స్ప­ష్టం చే­శా­రు. అయి­తే కవిత కాం­గ్రె­స్ పా­ర్టీ­లో­కి వస్తా­నం­టే మా­త్రం వ్య­తి­రే­కి­స్తా­న­ని తె­లి­పా­రు. కవి­త­పై హరీ­ష్ రావు, కే­టీ­ఆ­ర్, కే­సీ­ఆ­ర్, సం­తో­ష్ రావు దాడి చే­స్తు­న్నా­ర­ని సా­ను­భూ­తి తె­లి­పా­రు. వారి కు­టుం­బం­లో ఆస్తి పం­చా­య­తీ నడు­స్తోం­ద­ని.. తనకు సం­బం­ధం లే­ద­ని రే­వం­త్ స్ప­ష్టం చే­శా­రు. కే­సీ­ఆ­ర్ కు­టుం­బా­న్ని ప్ర­జ­లు సా­మా­జి­కం­గా బహి­ష్క­రిం­చా­ర­ని రే­వం­త్ స్ప­ష్టం చే­శా­రు. కే­సీ­ఆ­ర్ ఉద్య­మం పే­రు­తో యు­వ­త­ను పొ­ట్టన పె­ట్టు­కు­న్నా­ర­న్నా­రు. ఇప్పు­డు ఆ ఉసు­రు తాకే కు­మా­ర్తె దూ­ర­మైం­ద­ని రే­వం­త్ వ్యా­ఖ్యా­నిం­చా­రు. గతం­లో నా కూ­తు­రు పె­ళ్లి­కి వె­ళ్ల­కుం­డా అడ్డు­కు­న్నా­ర­ని గు­ర్తు చే­శా­రు.

సీబీఐ విచారణ ఆపుతోందే కిషన్‌రెడ్డి

కా­ళే­శ్వ­రం­పై సీ­బీఐ వి­చా­ర­ణ­ను ఆపు­తోం­ద­ని కి­ష­న్ రె­డ్డే­న­ని తె­లం­గాణ సీఎం రే­వం­త్ రె­డ్డి సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు. కేం­ద్ర మం­త్రి కి­ష­న్ రె­డ్డి­కి సొంత అభి­ప్రా­యా­లు ఉం­డ­వ­ని.. ఆయన కే­టీ­ఆ­ర్ వద్ద నుం­చి సల­హా­లు తీ­సు­కుం­టా­ర­న్నా­రు. కే­టీ­ఆ­ర్ సల­హా­ల­తో­నే కా­ళే­శ్వ­రం పై సీ­బీఐ వి­చా­ర­ణ­కు అడ్డం పడు­తు­న్నా­ర­ని వ్యా­ఖ్యా­నిం­చా­రు. ఉప­రా­ష్ట్ర­ప­తి ఎన్ని­క­ల­లో బీ­ఆ­ర్ఎ­స్ పో­టీ­చే­య­డ­మే దీ­ని­కి సా­క్ష్య­మ­న్నా­రు. గతం­లో కా­ళే­శ్వ­రం కేసు సీ­బీ­ఐ­కి ఇస్తే 48 గం­ట­ల్లో వి­చా­రణ ప్రా­రం­భి­స్తా­మ­ని కి­ష­న్ రె­డ్డి చె­ప్పా­ర­ని రే­వం­త్ రె­డ్డి ఈ సం­ద­ర్భం­గా గు­ర్తు చే­శా­రు. కి­ష­న్ రె­డ్డి చె­ప్పా­రు కానీ ఇప్ప­టి వరకూ చే­య­లే­ద­న్నా­రు. ఫోన్ ట్యా­పిం­గ్ కే­సు­ను కూడా సీ­బీ­ఐ­కి ఇస్తు­న్నా­ర­ని జరు­గు­తు­న్న ప్ర­చా­రం­పై­నా రే­వం­త్ స్పం­దిం­చా­రు. ప్ర­స్తు­తం ఫోన్ ట్యా­పిం­గ్ అంశం హై­కో­ర్టు పరి­ధి­లో ఉం­ద­ని.. లే­క­పో­తే సీ­బీ­ఐ­కి ఇచ్చే వా­ళ్ల­మ­న్నా­రు.

డ్రగ్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం

డ్ర­గ్స్ ని­యం­త్ర­ణ­కు తమ ప్ర­భు­త్వం కఠిన చర్య­లు తీ­సు­కుం­టుం­ద­ని తె­లి­పా­రు. “మా ప్ర­భు­త్వం ఏర్ప­డి­న­ప్ప­టి నుం­చి డ్ర­గ్స్‌­ను కం­ట్రో­ల్ చే­స్తు­న్నాం. మా ఈగల్ టీం గోవా వె­ళ్లి డ్ర­గ్స్‌­తో సం­బం­ధం ఉన్న­వా­రి­ని పట్టు­కుం­ది. హై­ద­రా­బా­ద్‌­లో దొ­రి­కిన డ్ర­గ్స్ తయా­రీ కం­పె­నీ గత ప్ర­భు­త్వం­లో­నే ఏర్ప­డిం­ది. కే­టీ­ఆ­ర్ బా­మ్మ­ర్ది ఫా­మ్‌­హౌ­స్‌­లో డ్ర­గ్స్‌­తో దొ­రి­కా­రు” అని ఆరో­పిం­చా­రు. మం­త్రు­ల­ను తాను భయ­పె­ట్ట­డం లే­ద­ని.. ఎవరి పని వారు చే­సు­కుం­టు­న్నా­ర­ని రే­వం­త్ తె­లి­పా­రు. స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల­పై­నా రే­వం­త్ చర్చిం­చా­రు. నె­లా­ఖ­రు­లో­పు స్థా­నిక ఎన్ని­క­లు ని­ర్వ­హిం­చ­డం అసా­ధ్య­మ­న్నా­రు. అం­దు­కే స్థా­నిక ఎన్ని­కల ని­ర్వ­హ­ణ­పై ఇంకా ని­ర్ణ­యం తీ­సు­కో­లే­ద­న్నా­రు. ఈ అం­శం­పై న్యా­య­ని­ప­ణు­ల­ను సం­ప్ర­ది­స్తు­న్నా­మ­ని తె­లి­పా­రు. బి­ల్లు­ల­పై రా­ష్ట్ర­ప­తి, గవ­ర్న­ర్ లకు సు­ప్రీం­కో­ర్టు ఇచ్చిన 90 రో­జుల గడు­వు­పై...సు­ప్రీం­కో­ర్టు­లో తుది తీ­ర్పు వచ్చే వరకూ ఎదు­రు చూ­స్తా­మ­న్నా­రు.

ఫిరాయింపులపై నిర్ణయం స్పీకర్‌దే

“కం­డు­వా­లు కప్పి­నంత మా­త్రాన పా­ర్టీ మా­రి­న­ట్లు కాదు. హరీ­ష్ రావే మాకు 37 మంది ఎమ్మె­ల్యేల మద్ద­తు ఉం­ద­ని అసెం­బ్లీ­లో చె­ప్పా­రు. పా­ర్టీ మా­రిన ఎమ్మె­ల్యేల అన­ర్హ­త­పై స్పీ­క­ర్ ని­ర్ణ­యం తీ­సు­కుం­టా­రు” అని రే­వం­త్ రె­డ్డి అన్నా­రు. రా­ష్ట్రం­లో యూ­రి­యా కొ­ర­త­కు కేం­ద్ర ప్ర­భు­త్వ­మే కా­ర­ణ­మ­ని ఆరో­పిం­చా­రు. “రా­ష్ట్రా­ని­కి 9 లక్షల మె­ట్రి­క్ టన్నుల యూ­రి­యా అవ­స­రం. ప్ర­స్తు­తం 2 లక్షల మె­ట్రి­క్ టన్నుల కొరత ఉంది. బీ­జే­పీ, టీ­ఆ­ర్‌­ఎ­స్ ఈ వి­ష­యం­లో రా­జ­కీ­యా­లు చే­స్తు­న్నా­యి” అని వి­మ­ర్శిం­చా­రు.

నక్సలైట్లతో చర్చలు ఎందుకు జరపరు.?

నక్స­లై­ట్లు లొం­గి­పో­వ­డా­ని­కి రా­ష్ట్ర, కేం­ద్ర ప్ర­భు­త్వా­లు పా­ల­సీ­లు తీ­సు­కొ­చ్చా­య­ని చె­ప్పా­రు. టె­ర్ర­రి­స్టు­ల­తో చర్చ­లు జర­ప­డా­ని­కి కేం­ద్రం సి­ద్ధం­గా ఉన్న­ప్పు­డు, నక్స­లై­ట్ల­తో చర్చ­లు చె­ప్ప­డా­ని­కి ఇబ్బం­ది ఏం­ట­ని ప్ర­శ్నిం­చా­రు. “లో­కే­ష్ నాకు తమ్ము­డు లాం­టి­వా­డు అని కే­టీ­ఆ­ర్ చె­ప్పా­రు. మరి తమ్ము­డు లో­కే­ష్ తం­డ్రి­ని జై­ల్లో పె­ట్టి­న­ప్పు­డు కే­టీ­ఆ­ర్ ఎక్కడ ఉన్నా­డు” అని రే­వం­త్ రె­డ్డి ఎద్దే­వా చే­శా­రు. స్థా­నిక సం­స్థల ఎన్ని­కల ని­ర్వ­హ­ణ­పై ఇంకా ని­ర్ణ­యం తీ­సు­కో­లే­ద­ని ఈ సం­ద­ర్భం­గా సీఎం చె­ప్పా­రు.

Tags:    

Similar News