REVANTH: మీరు బాగా పనిచేస్తే.. మళ్లీ నేనే సీఎం

గురువులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి... నూతన విద్యా విధానం కావాలన్న సీఎం.... విద్యాశాఖ సమస్యలు పరిష్కరిస్తున్నా.... టీచర్లు పిల్లలతో కలిసి భోజనం చేయండి

Update: 2025-09-06 02:30 GMT

తె­లం­గా­ణ­లో వి­ద్యా సం­స్క­ర­ణ­లు అమలు చేసి.. రెం­డో సారి గె­ల­వా­ల­న్న స్వా­ర్థం­తో­నే వి­ద్యా­శా­ఖ­ను తన వద్ద ఉం­చు­కు­న్నా­ని ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌­రె­డ్డి అన్నా­రు. గు­రు­వు­లు బాగా పని­చే­స్తే వచ్చే­సా­రి మళ్లీ తానే ము­ఖ్య­మం­త్రి­ని అవు­తా­న­ని ఆశా­భా­వం వ్య­క్తం చే­శా­రు. హై­ద­రా­బా­ద్‌­లో­ని మా­దా­పూ­ర్‌ శి­ల్ప­క­ళా­వే­ది­క­లో ని­ర్వ­హిం­చిన గు­రు­పూ­జో­త్స­వం­లో సీఎం రే­వం­త్‌­రె­డ్డి పా­ల్గొ­న్నా­రు. గు­రు­పూ­జో­త్సవ కా­ర్య­క్ర­మా­ని­కి రా­వ­డం సం­తో­షం­గా ఉం­ద­న్నా­రు. వి­ద్యా­శాఖ అత్యంత ప్రా­ధా­న్య­త­తో కూ­డు­కు­న్న­ద­ని, వి­ద్యా­శా­ఖ­ను స్వ­యం­గా పర్య­వే­క్షి­స్తూ ప్ర­తి­స­మ­స్య­ను పరి­ష్క­రి­స్తు­న్నా­న­ని చె­ప్పా­రు. వి­ద్యా­శా­ఖ­లో ఎన్నో సం­స్క­ర­ణ­లు తీ­సు­కు­రా­వా­ల్సిన అవ­స­ర­ముం­ద­ని, తె­లం­గా­ణ­కు నూతన వి­ద్యా వి­ధా­నం కా­వా­ల­ని తె­లి­పా­రు. "ము­ఖ్య­మం­త్రు­లు చాలా మంది రె­వె­న్యూ, ఆర్ధిక శాఖ, నీ­టి­పా­రు­దల శా­ఖ­ల­ని వారి దగ్గర పె­ట్టు­కుం­టా­రు.కానీ తాను  వి­ద్యా శా­ఖ­ను­నా దగ్గర పె­ట్టు­కు­న్నా­న­ని సీఎం రే­వం­త్ రె­డ్డి అన్నా­రు. వి­ద్యా సం­స్క­ర­ణ­లు అమలు చేసి రెం­డో­సా­రి గె­లు­స్తా. నేను ఉంటే వి­ద్యా శాఖ బా­గు­ప­డు­తుం­ద­నో, పేద పి­ల్ల­లు బా­గు­ప­డు­తా­ర­నో కొం­ద­రు నాపై వి­మ­ర్శ­లు చే­స్తు­న్నా­రు. వి­ద్యా శాఖ ఇం­కె­వ­రి­కై­నా ఇవ్వా­ల­ని వి­మ­ర్శి­స్తు­న్నా­రు.” అని అన్నా­రు.

బీఆర్ఎస్‌పై విమర్శలు

కేజీ టూ పీజీ ఉచిత వి­ద్య అం­ది­స్తా­మ­ని చె­ప్పి పదే­ళ్లు గడి­చిం­ది.. మరి అది అమలు జరి­గిం­దా అనే­ది మీరే ఆలో­చిం­చు­కో­వా­ల­ని టీ­చ­ర్ల­ను ఉద్దే­శిం­చి వ్యా­ఖ్యా­నిం­చా­రు. తె­లం­గాణ ఉద్య­మం­లో ప్ర­తీ పల్లె­కు జై తె­లం­గాణ ని­నా­దా­న్ని చే­ర­వే­సిం­ది ఉపా­ధ్యా­యు­లే­న­న్నా­రు. పదే­ళ్లు­గా టీ­చ­ర్ల బది­లీ­లు జర­గ­లే­దు ..2017 నుం­చి టీ­చ­ర్ల ని­యా­మ­కా­లు జర­గ­లే­దు ..మా ప్ర­భు­త్వం ఏర్ప­డిన వెం­ట­నే కే­వ­లం 55 రో­జు­ల్లో 11 వేల టీ­చ­ర్ల ని­యా­మ­కా­లు పూ­ర్తి చే­శా­మ­న్నా­రు. వి­ద్య­ను లా­భ­సా­టి వ్యా­పా­రం­గా మా­ర్చు­కు­ని ఆధి­ప­త్యం చె­లా­యిం­చా­ల­ని ఆనా­టి పా­ల­కు­లు ప్ర­య­త్నిం­చా­ర­న్నా­రు.  వి­ద్యా­రం­గా­న్ని గత ప్ర­భు­త్వం వ్యా­పా­రం­గా మా­ర్చు­కుం­ద­ని రే­వం­త్‌­రె­డ్డి తీ­వ్ర వి­మ­ర్శ­లు చే­శా­రు. గత ప్ర­భు­త్వం­లో నూతన ని­యా­మ­కా­లు లే­వ­ని ఆరో­పిం­చా­రు. గొ­ప్ప చరి­త్ర కలి­గిన ఉస్మా­ని­యా యూ­ని­వ­ర్సి­టీ మూ­త­ప­డే పరి­స్థి­తి­కి వచ్చిం­ద­న్నా­రు. ప్ర­భు­త్వ పా­ఠ­శా­ల­ల్లో­నూ నర్స­రీ, ఎల్‌­కే­జీ, యూ­కే­జీ తర­గ­తు­లు బో­ధి­స్తు­న్న­ట్లు చె­ప్పా­రు. "పి­ల్ల­ల­తో కలి­సే టీ­చ­ర్ల మధ్యా­హ్న భో­జ­నం చే­యా­లి. , టీ­చ­ర్ల చొ­ర­వ­తో కొ­త్త­గా 3 లక్షల మంది ప్ర­భు­త్వ పా­ఠ­శా­ల­ల్లో చే­రా­రు.” అని రే­వం­త్‌­రె­డ్డి అన్నా­రు.

Tags:    

Similar News