REVANTH: దక్షిణాది, చిన్న రాష్ట్రాలకు అన్యాయం: సీఎం

మహి­ళా బి­ల్లు­కు ప్ర­తి ఒక్క­రూ మద్ద­తి­స్తామన్న రేవంత్

Update: 2026-04-13 12:30 GMT

మహి­ళా బి­ల్లు­కు ప్ర­తి ఒక్క­రూ మద్ద­తి­స్తా­ర­ని సీఎం రే­వం­త్‌ రె­డ్డి అన్నా­రు. లో­క్‌­సభ సీ­ట్ల పెం­పు వి­ష­యం­లో­నే భి­న్నా­భి­ప్రా­యా­లు ఉన్నా­య­ని పే­ర్కొ­న్నా­రు. ఈ మే­ర­కు ప్ర­ధా­ని మో­దీ­ని ఉద్దే­శి­స్తూ సీఎం రే­వం­త్‌ ఎక్స్‌­లో పో­స్టు పె­ట్టా­రు. ‘‘లో­క్‌­సభ సీ­ట్ల పెం­పు వి­ష­యం­పై అఖి­ల­ప­క్ష భే­టీ­లో చర్చిం­చి ని­ర్ణ­యం తీ­సు­కో­వా­లి. లో­క్‌­సభ సీ­ట్ల పెం­పు, మహి­ళా రి­జ­ర్వే­ష­న్లు వే­ర్వే­ర­నే­ది ప్ర­తి పౌ­రు­డి­కీ తె­లు­సు. అసెం­బ్లీ సీ­ట్ల­లో మహి­ళా రి­జ­ర్వే­ష­న్లు అమలు చే­స్తే దేశం మొ­త్తం ఆమో­ది­స్తుం­ది. మహి­ళా రి­జ­ర్వే­ష­న్ల పే­రు­తో.. జనా­భా ఆధా­రం­గా లో­క్‌­సభ సీ­ట్లు పెం­చా­ల­ని భా­జ­పా చూ­స్తోం­ది. దక్షి­ణా­ది, చి­న్న రా­ష్ట్రా­ల­కు ఈ వి­ధా­నం అన్యా­యం చే­స్తుం­ది. భవి­ష్య­త్‌­లో దే­శా­న్ని బల­హీ­నం చే­స్తుం­ది. ఏ పా­ర్టీ­కై­నా జా­తీయ ప్ర­యో­జ­నా­లే ము­ఖ్యం­గా ఉం­డా­లి’’ అని సీఎం పే­ర్కొ­న్నా­రు. ఉత్తరాది రాష్ట్రాలు దేశానికి రాజకీయ రాజధానులైతే, దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక రాజధానులని ఆయన అభివర్ణించారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరగకూడదని స్పష్టం చేశారు. దేశానికి అత్యధిక ఆదాయాన్ని, జీఎస్‌డీపీని అందిస్తున్న దక్షిణాది రాష్ట్రాలను డీలిమిటేషన్ పేరుతో శిక్షించడం దేశ మనుగడకే ప్రమాదకరమని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచడం వల్ల అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. దేశంలో పెంచాలనుకుంటున్న 273 అదనపు సీట్లలో 50 శాతం జనాభా ప్రాతిపదికన, మిగిలిన 50 శాతాన్ని ఆయా రాష్ట్రాల ఆర్థిక వృద్ధిరేటు ఆధారంగా కేటాయించాలని ఆయన ప్రతిపాదించారు. దీనిపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరగాలని కోరారు.

Tags:    

Similar News