LOKESH: రాష్ట్రపతిని కలిసిన మంత్రి లోకేశ్
రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేష్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. ఎన్డీయే ఎంపీలతో కలిసి ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిని ఏపీ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతికి లోకేశ్, ఎన్డీయే ఎంపీలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫునా ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో రాజధాని రైతులు, ఏపీ ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఆమెకు వివరించారు. లోకేశ్, ఎంపీలతో ముచ్చటించారు ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు విజనరీ లీడర్ అంటూ మెచ్చుకున్నారు. అమరావతి నిర్మాణానికి రైతులు 33 వేల ఎకరాలు ఇవ్వడం నిజంగా హర్షణీయమన్నారు ద్రౌపది ముర్ము. అందుకు కృషి చేసిన చంద్రబాబు గ్రేట్ అన్నారు.
చంద్రబాబు మార్క్ సంస్కరణలు
ఏపీలో పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు సీఎం చంద్రబాబు విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ‘డీ-రెగ్యులేషన్ ఫేజ్-2’ సమీక్షలో భాగంగా.. పరిశ్రమల ఏర్పాటుకు ఆటంకంగా ఉన్న 800కు పైగా నిబంధనలను 100 లోపుకు తగ్గించాలని అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక అనుమతుల కాలాన్ని 40 శాతం తగ్గించడమే లక్ష్యంగా.. సింగిల్ రిజిస్ట్రేషన్ ద్వారా జీవితకాల గుర్తింపునివ్వాలని అధికారులను సూచించారు. పరిశ్రమల ఏర్పాటుకు ఆటంకాలు ఉండవద్దని ఆదేశించారు.