Telangana News : తెలంగాణలో ఢీ అంటే ఢీ.. బీఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్..

Update: 2026-04-13 14:15 GMT

తెలంగాణలో అప్పుడే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ ఎస్ అన్నట్టు రాజకీయాలు సాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. వాస్తవానికి ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ అప్పుడే ఎన్నికల వేడిని తలపించేలా బీఆర్ ఎస్, కాంగ్రెస్ నేతలు మాటల యుద్ధం సాగిస్తున్నారు. వచ్చేది మా ప్రభుత్వమే అంటే మా ప్రభుత్వమే అన్నట్టు మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఫ్యూచరే లేదు కానీ ఫ్యూచర్ సిటీని కడుతానంటూ ప్రగల్బాలు పలుకుతున్నారని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

అటు కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద విమర్శలతో దాడి చేస్తున్నారు. ముఖ్యంగా భూముల విషయంలోనే రెండు పార్టీల నడుమ తీవ్ర ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఇంత కాలం ఒక ఎత్తు.. ఇప్పటి నుంచి ఒక ఎత్తు అన్నట్టు ఇరు పక్షాలు విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే పార్టీ భారీ బహిరంగ సభ గురించి చర్చలు జరుపుతున్నారు గులాబీ బాస్.

జీవన్ రెడ్డి రాక సందర్భంగా బహిరంగ సభ నిర్వహించి ప్రజల్లోకి బలమైన మెసేజ్ ఇవ్వాలని చూస్తున్నారు గులాబీ బాస్. దీంతో రెండు పార్టీల్లో అప్పుడే అలజడి మొదలైంది. కేసీఆర్ ఇక నుంచి బయటే తిరుగుతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. దానిపై ఇంకా క్లారిటా రావాల్సి ఉంది. ఈ లోగా రెండు పార్టీల నడుమ తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నారు.

Tags:    

Similar News