Revanth Reddy: బీజేపీ, టీఆర్‌ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి: రేవంత్ రెడ్డి
Revanth Reddy: టీఆర్‌ఎస్, బీజేపీపై నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..;
Revanth Reddy: టీఆర్‌ఎస్, బీజేపీపై నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఎనిమిదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు ఏం చేయకపోయినా సీఎం కేసీఆర్ కనీసం ప్రశ్నించడం లేదని మండిపడ్డారు.. ఫ్లెక్సీల పేరుతో రాజకీయ డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.. వారం రోజులుగా ప్రజా సమస్యలను వదిలేసి టీఆర్‌ఎస్, బీజేపీ చిల్ల రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.. గత ఎనిమిదేళ్లుగా హామీల విషయంలో కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు రేవంత్ రెడ్డి. కార్పొరేట్ కంపెనీల పైసలతో బీజేపీ కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకుంటోందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.. తెలంగాణకు అన్యాయం చేయడానికే మోదీ వచ్చారన్నారు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మోదీని ప్రధానిగా అంగీకరించడం లేదన్నారు.