Revanth Reddy : కాంగ్రెస్ త్యాగాల ముందు టీఆర్‌ఎస్ ఓ లెక్కా? : రేవంత్
Revanth Reddy : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సభతో పోరాటాల గడ్డ వరంగల్ నుంచే మరో ఉద్యమం ఆరంభించబోతున్నట్లు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు.;
Revanth Reddy : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సభతో పోరాటాల గడ్డ వరంగల్ నుంచే మరో ఉద్యమం ఆరంభించబోతున్నట్లు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఉద్యమం చేస్తుందన్నారు.
రైతులకు లక్ష రుణమాఫీ హామీ ఏమైందని సీఎం కేసీఆర్‌ను రేవంత్ ప్రశ్నించారు. ఖమ్మంలో రైతులకు సంకెళ్లు వేసిన ఘనత టీఆర్‌ఎస్‌దని మండిపడ్డారు. మిర్చీకి గిట్టుబాటు ధర అడిగితే జైల్లో పెడతారా అని నిలదీశారు.
చెరుకు ఫ్యాక్టరీలు మూసేయడంతోనే రైతులు గత్యంతరం లేక వరి వైపు మళ్లారని రేవంత్ తెలిపారు. వడ్ల కొనుగోలుపై ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో కల్లాలమీదనే రైతులు గుండెలు పగిలి చనిపోయిన ఘటనలు ఉన్నాయన్నారు. చనిపోయిన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు.