Revanth Reddy: పేదలకు సాయం చేయాల్సిందిపోయి.. ప్రభుత్వాలు జేబుదొంగల్లా మారాయి: రేవంత్‌రెడ్డి

Revanth Reddy: రైతుల సమస్యలకు కారణం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనన్నారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.

Update: 2022-03-26 13:32 GMT

Revanth Reddy (tv5news.in)

Revanth Reddy: రైతుల సమస్యలకు కారణం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనన్నారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. రైతుల నుంచి ధాన్యం కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కొన్న ధాన్యాన్ని ఎవరికి అమ్ముకుంటుందో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమన్నారు. కేసీఆర్‌ ప్రతి గింజా కొంటామన్నారని.. కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. ముఖ్యమంత్రి ఈ అంశంపై ప్రధానిని ఎందుకు కలవడం లేదన్నారు.

ఢిల్లీలో కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటే తామూ ఏర్పాట్లు చేస్తామన్నారు. మంత్రుల బృందంలో మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు ఎందుకు లేరని ప్రశ్నించారు. ఇక.. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని దోచుకుంటున్నాయని విమర్శించారు రేవంత్‌రెడ్డి. 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే పెట్రోల్‌ ధరలు పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పెట్రో ధరలు పెంచితే రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచిందన్నారు.

Tags:    

Similar News