Revanth Reddy: టీఆర్‌ఎస్‌ను ఓడించండి అని పీకే స్వయంగా చెప్పడం మీరు వింటారు- రేవంత్‌రెడ్డి
Revanth Reddy: ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరడంపై టీవీ5తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు PCC చీఫ్ రేవంత్‌రెడ్డి.;
Revanth Reddy: ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరడంపై టీవీ5తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు PCC చీఫ్ రేవంత్‌రెడ్డి. టీఆర్‌ఎస్‌తో తెగతెంపులు చేసుకోవడానికే పీకే వెళ్లి కేసీఆర్‌ను కలిసారని వివరించారు. ఇక ప్రశాంత్ కిషోర్‌కి టీఆర్‌ఎస్‌కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే ఐప్యాక్‌కు ప్రశాంత్ కిషోర్‌కి కూడా ఎలాంటి సంబంధం ఉండదని అన్నారు. తాను ముందు నుంచి చెప్పిందే ఇప్పుడు జరిగిందని టీవీ5తో అన్నారు రేవంత్‌రెడ్డి.
పీకే కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తనతో కలిసి ప్రెస్‌మీట్ పెట్టేరోజు దగ్గర్లోనే ఉందని చెప్పుకొచ్చారు. ఆ రోజు పీకేనే స్వయంగా టీఆర్‌ఎస్‌ను ఓడించండి అని ఆయన నోటి నుంచే చెప్పడం మీరు వింటారన్నారు రేవంత్. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరాక ఆయనకు పార్టీ అధిష్టానం మాటే ఫైనల్ అని అన్నారు. కాంగ్రెస్‌పార్టీలో ప్రశాంత్ కిషోర్ చేయడంపై స్పష్టత వస్తోంది. పీకే ప్రతిపాదనలు, చేరికపై అధినేత్రి సోనియాకు కాంగ్రెస్ నేతల ప్రత్యేక కమిటీ నివేదిక ఇచ్చింది.
ఆ కమిటీలో సభ్యులుగా ఉన్న ఏకే ఆంటోని, దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలా ఉన్నారు. వీరంతా తమ రిపోర్ట్‌ను అందించారు. ఇటు.. ఇదే టైమ్‌లో PK ఎంట్రీపై రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే గాంధీభవన్‌లో తాను, PK కలిసి ప్రెస్‌మీట్‌పెట్టేరోజు వస్తుందన్నారు. TRSను ఓడించండి అని PKనే పిలుపు ఇస్తారని అన్నారు. ఐప్యాక్‌ను ప్రశాంత్ కిషోర్ వీడితే అది నామమాత్రంగానే ఉంటుందంటూ టీవీ5తో చెప్పుకొచ్చారు రేవంత్‌రెడ్డి. కెప్టెన్ లేని నావ ఎవరు నడిపినా ఉపయోగం ఉండదన్నారు.
సోషల్ మీడియాలో పోస్టుల కోసమో, మరో రకమైన ప్రచారం కోసమో తప్ప.. అసలైన రాజకీయ వ్యూహాలకు PK లేని ఐప్యాక్ పనికి రాదన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగానో, మరో పదవిలోనో ఉంటూ TRSకు ఆయన పనిచేస్తారనుకోవడం భ్రమేనని.. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం తన వైఖరి స్ఫష్టంగా చెప్పినందునే PK.. అన్నీ తెగతెంపులు చేసుకుని తమ పార్టీలోకి వస్తున్నారని అన్నారు. కాంగ్రెస్-TRSలు కలిసిపోయాయి అంటూ BJP నేతలు తప్పుడు ప్రచారం చేయడం ఇకనైనా ఆపాలన్నారు.