Revanth Reddy: డి శ్రీనివాస్‌ని కలిసిన రేవంత్ రెడ్డి.. వ్యూహం అదేనా!!
Revanth Reddy: టీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ తో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అవడం.. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.;
Revanth Reddy: టీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ తో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అవడం.. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రేవంత్ తో పాటు పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ కూడా ఉన్నారు.
వీరు ఏఏ అంశాలపై చర్చించారన్నదానిపై స్పష్టత రాకున్నా.. డీఎస్‌ను మళ్లీ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించేదుకే అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎంపీగా ఉన్న డీఎస్... చాలా కాలంగా గులాబీ పార్టీతో అంటీ ముట్టకుండా ఉన్నారు.
అంతేకాదు.. పార్టీ వైఖరిపై చాలాసార్లు బహిరంగ విమర్శలు చేశారు. అలాగే ఆయన రాజకీయ వారసుడు సంజయ్ కూడా ఇటీవలే మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మరోవైపు కాంగ్రెస్ అధినాయకత్వం కూడా... పార్టీని వీడి వెళ్లిన వారిని తిరిగి రప్పించుకునే వ్యూహాల్లో ఉన్నందున... డీఎస్ మళ్లీ కాంగ్రెస్ చేరడం ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.