Revanth Reddy : అప్పటివరకు ఓపికపడితే కాంగ్రెస్‌దే అధికారం : రేవంత్ రెడ్డి
Revanth Reddy : పార్టీ ఫిరాయింపులకు తెలంగాణను కేసీఆర్ ప్రయెగశాలగా మార్చారని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.;
Revanth Reddy : పార్టీ ఫిరాయింపులకు తెలంగాణను కేసీఆర్ ప్రయెగశాలగా మార్చారని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మునుగోడులో సర్పంచ్‌లు, ఎంపీటీసీలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కొవిడ్ కారణంగా మునుగోడులో పర్యటించలేకపోయామని.. ఈనెల 20 నుంచి అక్కడే పర్యటిస్తామని తెలిపారు. కార్యకర్తలు ఎవరూ పార్టీ మారొద్దని సూచించారు. ఒక ఏడాది ఓపిక పడితే కాంగ్రెస్‌దే అధికారమన్నారు. పార్టీ మారి చరిత్ర హీనులుగా మారకండి అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.