REVANTH: తల్లి­దం­డ్రు­ల­ను ని­ర్ల­క్ష్యం చే­స్తే జీతం కట్: రే­వం­త్

ఉద్యోగులకు సీఎం రేవంత్ స్వీట్ వార్నింగ్

Update: 2025-09-28 05:00 GMT

తె­లం­గాణ గడ్డ­కు ఓ చరి­త్ర, పౌ­రు­షం ఉన్నా­య­ని ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌­రె­డ్డి అన్నా­రు. కాలం కలి­సి వచ్చి గె­లి­స్తే గత పా­ల­కు­లు తాము కా­ర­ణ­జ­న్ము­లం అను­కు­న్నా­ర­ని, వి­శ్వా­సం­తో ప్ర­జ­లు అధి­కా­ర­మి­స్తే.. వి­శ్వా­స­ఘా­త­కు­లు­గా మా­రా­ర­ని మం­డి­ప­డ్డా­రు. శి­ల్ప­క­ళా వే­ది­క­లో ని­ర్వ­హిం­చిన కా­ర్య­క్ర­మం­లో గ్రూ­ప్‌-1 వి­జే­త­ల­కు సీఎం చే­తుల మీ­దు­గా ని­యా­మక పత్రా­లు అం­ద­జే­శా­రు. 3 లక్షల మం­ది­తో పోటీ పడి... 562 మం­ది­లో ఒక­రి­గా మీ­రం­తా ని­లి­చా­ర­ని వి­జే­త­ల­ను కొ­ని­యా­డా­రు. మీరే తె­లం­గాణ భవి­ష్య­త్‌ అన్నా­రు. తె­లం­గాణ రా­ష్ట్రం ఆవి­ర్భా­వా­ని­కి ఆరు దశా­బ్ధాల పాటు జరి­గిన ఉద్య­మా­న్ని గు­ర్తు చే­సు­కు­న్నా­రు. తె­లం­గాణ కోసం ప్రా­ణ­త్యా­గం చే­సిన శ్రీ­కాం­త్ చారి, ఇషా­న్ రె­డ్డి­ల­ను స్మ­రిం­చా­రు. రా­ష్ట్రా­న్ని ఒక కు­టుం­బం, ఒక పా­ర్టీ సొ­త్తు అను­కు­నే రో­జు­లు ము­గి­శా­య­ని ఆయన వ్యా­ఖ్యా­నిం­చా­రు. గత పదే­ళ్ల­లో గ్రూ­ప్-1 పరీ­క్ష­లు ని­ర్వ­హిం­చ­ని పూ­ర్వ ప్ర­భు­త్వం­పై వి­మ­ర్శ­లు చే­శా­రు. ని­యా­మ­కాల వి­ష­యం­లో పా­ర­ద­ర్శ­కత పా­టిం­చక ఐదు కో­ట్లు తీ­సు­కు­ని ఉద్యో­గా­లు అమ్ము­కు­న్నా­ర­ని ఆరో­పిం­చా­రు.

ఉద్యోగులు జర భద్రం

కో­చిం­గ్ సెం­ట­ర్ల కు­ట్ర­ల­పై కూడా అభ్య­ర్థు­ల­ను అప్ర­మ­త్తం చే­శా­రు. లక్షల రూ­పా­య­లు పె­ట్టి కే­సు­లు వేసే ప్ర­య­త్నా­లు జరు­గు­తు­న్నా­య­ని ఆయన పే­ర్కొ­న్నా­రు. తె­లం­గాణ మో­డ­ల్‌­ను మనం సృ­ష్టిం­చా­ల­ని, గు­జ­రా­త్ మో­డ­ల్‌­ను అను­స­రిం­చా­ల్సిన అవ­స­రం లే­ద­ని అన్నా­రు. ఉద్యో­గు­లు ప్ర­జా­సే­వ­లో తల్లి­దం­డ్రు­ల­ను గు­ర్తు చే­సు­కో­వా­ల­ని సీఎం సూ­చిం­చా­రు. త్వ­ర­లో తల్లి­దం­డ్రుల సం­క్షే­మం కోసం ప్ర­త్యేక చట్టం తీ­సు­కొ­స్తా­మ­ని, వారి పట్ల ని­ర్ల­క్ష్యం కన­బ­రి­స్తే జీతం నుం­డి 10 శాతం కోసి తల్లి­దం­డ్రుల ఖా­తా­ల్లో జమ చే­స్తా­మ­ని ఆయన ప్ర­క­టిం­చా­రు. “మీ కళ్ల­ల్లో కంటే, మీ తల్లి­దం­డ్రుల కళ్ల­ల్లో ఆనం­దం చూ­డా­ల­ని నేను కో­రు­కుం­టు­న్నా­ను. టీ­జీ­పీ­ఎ­స్సీ రా­జ­కీయ పు­న­రా­వాస కేం­ద్రం కాదు.. తె­లం­గాణ పు­న­ర్న­ర్మాణ కేం­ద్రం” అని సీఎం రే­వం­త్ రె­డ్డి అన్నా­రు.

Tags:    

Similar News