MLC Kavitha : విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకుంటున్న రేవంత్ సర్కార్.. కవిత తీవ్ర విమర్శలు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో విద్యార్థుల ప్రాణాలను కాంగ్రెస్ సర్కార్ బలి తీసుకుంటుందని మండిపడ్డారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 95 మంది విద్యార్థుల ప్రాణాలను ప్రభుత్వం తీసిందని ...విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం విద్యార్థుల ఆత్మహత్యల పై ఎలాంటి చర్య తీసుకోకపోవడం దారుణం అని ధ్వజమెత్తారు.
కాగా ఇటీవల తెలంగాణలోని గురుకులాలు, కేజీబీవీలు, సంక్షేమ హాస్టళ్లలో పలువురు విద్యార్థులు ఆత్మహత్య లకు పాల్పడ్డారు. వివిధ కారణాలతో విద్యార్థులు మృతి చెందారు. ఐతే విద్యార్థుల ఆత్మహత్య లకు గల కారణాలు ఏంటి అనేది ఇప్పటివరకు తెలియలేదు.. ఈ విషయం పై ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత. విద్యార్థులపై దయలేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆత్మహత్య లను ఆపేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయక పోవడం విచారకరం అన్నారు.
వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ పేరుతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురించి ప్రచారం చేసుకోవడమే సరిపోతుందని... విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పని చేస్తే ఇలాంటి దురదృష్ట ఘటనలు జరగకుండా ఉంటాయని అన్నారు. విద్యాశాఖను స్వయంగా చూస్తున్న ముఖ్యమంత్రి ఇకనైనా విద్యార్థుల మరణాలను అరికట్టేందుకు ప్రయత్నించాలి" అని కవిత తన ట్వీట్ లో పేర్కొన్నారు.