తెలంగాణ ప్రభుత్వం భూములు, జల వనరుల సంరక్షణ కోసం కొత్త కొత్త ప్రణాళికలు రచిస్తోంది. ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రత్యేకంగా హైడ్రా చట్టాన్ని తీసుకొచ్చింది. అక్రమ నిర్మాణాలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాల కూల్చివేతలో లీగల్ చిక్కులు రాకుండా ఉండేందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
సాయంత్రం జరగనున్న కేబినెట్ లో ల్యాండ్ ను కాపాడేందుకు సర్వాధికారాలను హైడ్రాకు కట్టబెట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించడంపై చర్చించనున్నారు. ప్రధానంగా రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, పంచాయత్ రాజ్ శాఖలకు సంబంధించిన చట్టాలను కూడా సవరించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
కూల్చివేతలపై హైడ్రాకు చట్టబద్దత లేదన్న ప్రశ్నలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి దాకా హైడ్రాకు నోటీసులు జారీ చేసే అధికారం కూడా లేదు. అలాంటి సందేహాలకు, చట్టపరమైన ఇబ్బందులను అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నారు.