REVANTH: చారిత్రక నిర్ణయాలు తీసుకోండి: రేవంత్
కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ముఖ్యమంత్రి సూచన;
తెలంగాణను మూడు జోన్లుగా విభజించి మాస్టర్ ప్లాన్ రూపొందించినట్టు..నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఆపరేషన్ సింధూర్‌పై స్పందిస్తూ.. ప్రధాని మోదీకి, భారత సైన్యానికి అభినందనలు చెప్పారు. 2047 నాటికి భారతదేశాన్ని సూపర్ పవర్‌గా, నెంబర్ వన్‌గా నిలబెట్టాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పాన్ని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. వికసిత భారత్ ప్రణాళికను రూపొందించడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళిక సిద్ధమైందన్న రేవంత్... ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించామని తెలిపారు. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తామన్నారు తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల గణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు, ఎస్సీల ఉప వర్గీకరణకు ప్రజా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది' అని రేవంత్ రెడ్డి వివరించారు.