ఏపీ ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం రేవం- త్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. " కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వ- ర్యంలో జరిగిన సమావేశంలో బనకచర్ల ప్రాజెక్ట్ కడతామని ఏపీ చెప్పలేదు.. ఆపమని మేము అడగలేదు" అని రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ భేటీలో ఏపీ ప్రభుత్వం నుంచి గోదావరి- బనకచర్ల ప్రాజెక్టు కడతామన్న ప్రతిపాదన చర్చకు రాలేదని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. అజెండాలో వారు కడతామనే ప్రతిపాదనే చర్చకు రానప్పుడు ఆపాల- న్న చర్చే ఉండదన్నారు. ఇది అపెక్స్ కమిటీ భేటీ కాదని చె- ప్పారు. భేటీలో తీసుకున్న నిర్ణయాలన్నీ తెలంగాణ విజయమే. అనుమానించుకుంటూ పోతే ముందుకు సాగలేం. సమ- స్యలను పరిష్కరించుకునేందుకే ఉన్నాం.. గొడవలు పెట్టు- కునేందుకు కాదు. ఇరు రాష్ట్రాలు గొడవలు పెట్టుకోవాలని కొందరు చూస్తున్నారు. వివాదాలు లేకుండా సమస్యలను పరిష్కరించుకోవడమే మా అజెండా"అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాల అంశంలో ఉన్న సమస్యలపై చర్చించడానికి అధికారులు, ఇంజినీర్లతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని రే- వంత్రెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర, సాంకేతిక నిపుణులు ఈ కమిటీలో ఉంటారని చెప్పారు.
టెలీమెట్రీలకు ఏపీ అంగీకారం: మంత్రి ఉత్తమ్
అంతకుముందు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. అన్ని రిజర్వాయర్లు, కెనాల్స్ వద్ద యుద్ధప్రాతిపదికన టెలీమెట్రీలు ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. ‘‘కృష్ణా నదీజలాల వాడకం లెక్కలపై అనుమానాలున్నాయి. టెలీమెట్రీలు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాం. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా రాష్ట్రమే నిధులు కేటాయిస్తుందని చెప్పాం. వీటి ఏర్పాటుపై గత ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించింది. ఈ భేటీ సందర్భంగా టెలీమెట్రీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం’’అని తెలిపారు.