REVANTH: బీసీ రిజర్వేషన్లకు ఆ పార్టీలే అడ్డంకి

మోదీ, అమిత్ షాలపై తీవ్ర విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి.. ఢిల్లీలో ఆఖరి పోరాటం చేశామని స్పష్టీకరణ;

Update: 2025-08-08 02:00 GMT

కాం­గ్రె­స్‌ అగ్ర­నేత రా­హు­ల్‌­గాం­ధీ ఇచ్చిన హామీ మే­ర­కు తమ ప్ర­భు­త్వం ఈ ఏడా­ది ఫి­బ్ర­వ­రి­లో కు­ల­గ­ణన చే­ప­ట్టిం­ద­ని తె­లం­గాణ సీఎం రే­వం­త్‌­రె­డ్డి తె­లి­పా­రు. ఆ సర్వే లె­క్కల ప్ర­కా­రం బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్లు ఇవ్వా­ల­ని రా­ష్ట్ర ప్ర­భు­త్వం ని­ర్ణ­యిం­చిం­ద­ని చె­ప్పా­రు. ది­ల్లీ­లో ని­ర్వ­హిం­చిన మీ­డి­యా సమా­వే­శం­లో టీ­పీ­సీ­సీ చీఫ్ మహే­శ్‌­కు­మా­ర్‌ గౌ­డ్‌, పలు­వు­రు మం­త్రు­ల­తో కలి­సి సీఎం మా­ట్లా­డా­రు. ‘‘బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్లు కల్పి­స్తూ బి­ల్లు రూ­పొం­దిం­చి రా­ష్ట్ర­ప­తి­కి పం­పాం. ఆ రి­జ­ర్వే­ష­న్ల­పై పో­రా­డేం­దు­కే ఢి­ల్లీ­కి వచ్చాం. జం­త­ర్‌ మం­త­ర్‌ వద్ద మహా ధర్నా ని­ర్వ­హిం­చి కేం­ద్రా­న్ని ని­ల­దీ­శాం. గల్లీ­లో కాదు.. ఢి­ల్లీ­లో­నే తే­ల్చు­కుం­దా­మ­ని దేశ రా­జ­ధా­ని­కి వచ్చాం. ఈ ధర్నా­కు 100 మంది ఎం­పీ­లు మద్ద­తు ఇచ్చా­రు. రా­ష్ట్ర­ప­తి అపా­యిం­ట్‌­మెం­ట్‌ రా­కుం­డా ప్ర­ధా­ని మోదీ, కేం­ద్ర­మం­త్రి అమి­త్‌­షా అడ్డు­కు­న్నా­రు. ఆ అపా­యిం­ట్‌­మెం­ట్‌ కోసం మం­త్రి­వ­ర్గం మొ­త్తం ఎదు­రు చూ­స్తోం­ది. రా­ష్ట్ర­ప­తి­ని కలి­సే అవ­కా­శం మాకు ఇవ్వ­క­పో­వ­డం శో­చ­నీ­యం. ము­స్లిం రి­జ­ర్వే­ష­న్ల సా­కు­తో ఓబీ­సీ రి­జ­ర్వే­ష­న్ల­ను అడ్డు­కు­నేం­దు­కు బీ­జే­పీ చూ­స్తోం­ది." అని రే­వం­త్ రె­డ్డి ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­రు. బీసీ రి­జ­ర్వే­ష­న్ల వి­ష­యం­లో తె­లం­గాణ ప్ర­భు­త్వం­పై కేం­ద్ర మం­త్రి కి­ష­న్‌ రె­డ్డి చే­సిన వ్యా­ఖ్య­ల­కు ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌ రె­డ్డి కౌం­ట­ర్‌ ఇచ్చా­రు. రి­జ­ర్వే­ష­న్ల­లో వి­ద్యా ఉద్యోగ అవ­కా­శా­ల­కు మా­త్ర­మే వర్గీ­క­రణ ఉం­టుం­ద­ని, ఆయన చె­ప్పి­న­ట్లు ప్ర­త్యేక వర్గా­ని­కి రి­జ­ర్వే­ష­న్లేం లే­వ­ని అన్నా­రా­యన. కి­ష­న్ రె­డ్డి ముం­దు­గా చట్టం చద­వా­లి. రా­జ­కీయ ఓబీ­సీ రి­జ­ర్వే­ష­న్ల­లో  ఏబీ­సీ­డీ వర్గీ­క­రణ లేదు. బీ­సీఈ గ్రూ­పు­కు ఇప్ప­టి­కే నా­లు­గు శాతం రి­జ­ర్వే­ష­న్లు ఉన్నా­యి. అలాం­ట­ప్పు­డు కొ­త్త­గా 10% రి­జ­ర్వే­ష­న్లు ఎక్క­డి నుం­చి వచ్చా­యి. కి­ష­న్ రె­డ్డి అవ­గా­హన లే­కుం­డా  మా­ట్లా­డు­తు­న్నా­రు’’ అని సీఎం రే­వం­త్‌ అన్నా­రు.

మీ సర్టిఫికెట్ అవసరం లేదన్న రేవంత్

"రి­జ­ర్వే­ష­న్‌ సాధన కోసం పూ­ర్తి స్థా­యి­లో ప్ర­య­త్నా­లు చే­స్తు­న్నా­మ­ని రే­వం­త్‌ ఉద్ఘా­టిం­చా­రు. ‘‘బీసీ రి­జ­ర్వే­ష­న్‌­లు 42 శాతం ఇవ్వా­ల­న్న­ది మా కమి­ట్‌­మెం­ట్‌. మా కమి­ట్మెం­ట్‌­కు వి­ప­క్షాల సర్టి­ఫి­కె­ట్‌ అవ­స­రం లేదు. జం­త­ర్‌ మం­త­ర్‌ వే­ది­క­గా మా­వా­యి­స్‌ బలం­గా వి­ని­పిం­చాం. మా ఆఖరి పో­రా­టా­న్ని పూ­ర్తి చే­శాం. ని­ర్ణ­యం తీ­సు­కో­వా­ల్సిం­ది కేం­ద్రం­లో­ని బీ­జే­పీ­నే. బీ­సీ­ల­పై అంత ప్రేమ ఉంటే కేం­ద్రం వెం­ట­నే బి­ల్లు ఆమో­దిం­చా­లి. అబ­ద్ధా­ల­తో ప్ర­జ­ల్ని మభ్య పె­ట్ట­డం బీ­ఆ­ర్‌­ఎ­స్‌ నైజం. లో­క­ల్‌­బా­డీ ఎన్ని­క­లు సె­ప్టెం­బ­ర్‌ 30లోపు ని­ర్వ­హిం­చా­ల­ని హై­కో­ర్టు చె­ప్పిం­ది. ఆలో­పు బీసీ రి­జ­ర్వే­ష­న్ల­కు కేం­ద్రం ఆమో­దం తె­ల­ప­క­పో­తే ఎలా ముం­దు­కు వె­ళ్లా­ల­న్న­దా­ని­పై ఆలో­చన చే­స్తాం. ప్ర­జల అభి­ష్టం మే­ర­కే పా­ర్టీ ని­ర్ణ­యం ఉం­టుం­ది’’ అని రే­వం­త్‌ స్ప­ష్టం చే­శా­రు. వి­ద్యా, ఉద్యోగ, స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల్లో బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్లు కల్పిం­చేం­దు­కు క్షే­త్ర­స్థా­యి­లో మేము చే­యా­ల్సిన అన్ని ప్ర­య­త్నా­లు చే­శా­మ­ని రే­వం­త్ రె­డ్డి అన్నా­రు. బల­హీన వర్గాల హక్కు­ల­ను కా­ల­రా­య­డా­ని­కి బీ­జే­పీ మొ­ద­టి నుం­చి కు­ట్ర­లు చే­స్తూ­నే ఉం­ద­ని సీఎం వి­మ­ర్శిం­చా­రు. నాడు మం­డ­ల్ కమి­ష­న్ ద్వా­రా ఓబీ­సీ­ల­కు న్యా­యం చే­యా­ల­ని చూ­స్తే బీ­జే­పీ కమం­డ­ల్ పా­లి­టి­క్స్ కు తె­ర­లే­పిం­ద­ని రథ­యా­త్ర పే­రు­తో దే­శం­లో ఉద్రి­క్తత పరి­స్థి­తు­లు తీ­సు­కు­వ­చ్చిం­ద­ని ఆరో­పిం­చా­రు.

Tags:    

Similar News