REVANTH: మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం: రేవంత్

హైదరాబాద్ అభివృద్ధిలో ప్రముఖుల పాత్ర... చంద్రబాబు, వైఎస్ పాత్ర ఉందన్న రేవంత్.. అప్పుడు హైటెక్ సిటీని విమర్శించారన్న సీఎం;

Update: 2025-08-21 03:00 GMT

మూసీ ప్ర­క్షా­ళన చే­స్తా­మం­టే కొం­ద­రు వద్ద­ని అం­టు­న్నా­ర­ని.. ఈ నగ­రా­న్ని ఇలా­గే వది­లే­ద్దా­మా.. ప్ర­పం­చా­ని­కి ఆద­ర్శం­గా హై­ద­రా­బా­ద్ ను ని­లు­పు­కుం­దా­మా? వద్దా అని ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి ప్ర­శ్నిం­చా­రు. హై­ద­రా­బా­ద్ మహా­న­గ­రా­భి­వృ­ద్ధి­లో చాలా మంది ప్ర­ము­ఖుల పా­త్ర ఉం­ద­ని సీఎం రే­వం­త్ రె­డ్డి అన్నా­రు. ఇవాళ ఆయన గచ్చి­బౌ­లి­లో­ని ఇం­టి­గ్రే­టె­డ్ సబ్-రి­జి­స్ట్రా­ర్ కా­ర్యా­ల­యా­ని­కి శం­కు­స్థా­పన చే­శా­రు. ఈ సం­ద­ర్భం­గా ఆయన మా­ట్లా­డు­తూ.. ఇన్ఫో­సి­స్, మై­క్రో­సా­ఫ్ట్, గూ­గు­ల్ వంటి సం­స్థ­లు ఇక్క­డి నుం­చే పని చే­య­డం మనం­ద­రి­కీ గర్వ­కా­ర­ణ­మ­ని అన్నా­రు. చం­ద్ర­బా­బు, వై­ఎ­స్ఆ­ర్‌­‌­లు కూడా హై­ద­రా­బా­ద్ అభి­వృ­ద్ధి­కి కృషి చే­శా­ర­ని గు­ర్తు చే­శా­రు. ఇక దే­శం­లో ఐటీ పరి­శ్రమ అభి­వృ­ద్ధి వె­ను­కు స్వ­ర్గీయ రా­జీ­వ్ గాం­ధీ పా­త్ర కూడా ఉం­ద­ని తె­లి­పా­రు. కాం­గ్రె­స్ ప్ర­భు­త్వ హయాం­లో­నే హై­టె­క్స్ సి­టీ­కి పు­నా­ది రాయి పడిం­ద­ని, ఆ తరు­వాత దాని ని­ర్మా­ణా­న్ని చం­ద్ర­బా­బు కొ­న­సా­గిం­చా­ర­ని గు­ర్తు చే­శా­రు. హై­ద­రా­బా­ద్‌ అభి­వృ­ద్ధి­లో ఉమ్మ­డి రా­ష్ట్రం­లో సీ­ఎం­లు­గా వ్య­వ­హ­రిం­చిన చం­ద్ర­బా­బు నా­యు­డు, వై­ఎ­స్ రా­జ­శే­ఖ­ర్‌ రె­డ్డి పా­త్ర ఉం­ద­ని వె­ల్ల­డిం­చా­రు. 1994 నుం­చి 2014 వరకు హై­ద­రా­బా­ద్‌­ను అప్ప­టి సీ­ఎం­లు అభి­వృ­ద్ధి చే­సి­న­ట్లు పే­ర్కొ­న్నా­రు. గూ­గు­ల్‌­లాం­టి ప్ర­ముఖ సం­స్థ­ల్లో  తె­లు­గు­వా­రు పె­ద్ద పద­వు­ల్లో ఉన్నా­ర­ని తె­లి­పా­రు. మన ప్రాంత వి­ద్యా­ర్థు­లు ఇక్క­డే చదు­వు­కో­వా­ల­ని పలు సం­స్థ­లు ని­ర్మిం­చా­ర­ని గు­ర్తు చే­శా­రు.

అప్పుడు... ఇప్పుడు అవహేళనలే

‘‘హై­టె­క్ సిటీ కట్టి­న­ప్పు­డు అవ­హే­ళన చే­శా­రు. హై­ద­రా­బా­ద్‌ నగరం సిం­గ­పూ­ర్, టో­క్యో­తో పోటీ పడు­తోం­ది. మన వద్ద అన్ని ఉన్న­ప్పు­డు చి­త్త­శు­ద్ధి­తో పని­చే­య­డం కా­వా­లి. అమె­రి­కా­లో మన ఐటీ ని­పు­ణు­లు పని చే­య­డం ఆపే­స్తే స్తం­భిం­చి­పో­తుం­ది. రా­ష్ట్రం­లో శాం­తి భద్ర­త­ల­తో కూ­డిన ఉద్యోగ భద్రత ఇచ్చాం. రా­బో­యే పదే­ళ్ల­లో వన్ బి­లి­య­న్‌ డా­ల­ర్ల ఎకా­న­మీ­గా తీ­ర్చి­ది­ద్దు­తాం. ఇప్పు­డు మూసీ ప్ర­క్షా­ళన ఎం­దు­కు అడ్డు­కుం­టు­న్నా­రు. మూసీ ము­రి­కి­లో బత­కా­ల­ని పే­ద­లు ఎం­దు­కు అను­కుం­టా­రు? తె­లం­గాణ రై­జిం­గ్‌ 2047తో అభి­వృ­ద్ధి చే­సు­కుం­దాం. మె­ట్రో వి­స్త­రణ, మూసీ ప్ర­క్షా­ళన జర­గా­లి. సబ్‌ రి­జి­స్ట్రా­ర్ కా­ర్యా­ల­యా­ల్లో సరైన సౌ­క­ర్యా­లు లేవు. అన్ని సౌ­క­ర్యా­ల­తో సబ్ రి­జి­స్ట్రా­ర్‌ కా­ర్యా­ల­యా­లు ని­ర్మిం­చా­ల­ని ప్ర­భు­త్వం సం­క­ల్పి­స్తుం­ది." అని రే­వం­త్ అన్నా­రు. హై­ద­రా­బా­ద్ నగ­రా­న్ని వి­శ్వ నగ­రం­గా మా­ర్చు­కో­వా­ల్సిన అవ­స­రం ఉం­ద­ని అన్నా­రు. న్యూ­యా­ర్క్, టో­క్యో, సిం­గ­పూ­ర్‌­ల­తో హై­ద­రా­బా­ద్‌­కు పో­టీ­గా ని­ల­బె­ట్టా­ల­ని తె­లి­పా­రు. కానీ, మూసీ ప్ర­క్షా­ళన.. ఫ్యూ­చ­ర్ సిటీ కొం­ద­రి­కి నచ్చ­డం లే­ద­ని కా­మెం­ట్ చే­శా­రు. ఎవ­రె­న్ని చే­సి­నా మూసీ ప్ర­క్షా­ళన చేసి తీ­రు­తా­మ­న్నా­రు.

Tags:    

Similar News