REVANTH: దేశానికి ఫ్యూచర్ సిటీని అందిస్తాం

పెట్టుబడులను ఆకర్షించడంలో టాప్‌లో తెలంగాణ... హైదరాబాద్‌కు పోటీనే లేదన్న ముఖ్యమంత్రి రేవంత్‌..;

Update: 2025-07-04 06:00 GMT

దే­శా­ని­కి కాం­గ్రె­స్ సర్కా­ర్.. ఫ్యూ­చ­ర్ సి­టీ­ని అం­ది­స్తుం­ద­ని ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌­రె­డ్డి వె­ల్ల­డిం­చా­రు. అభి­వృ­ద్ధి­లో తె­లం­గాణ, తమి­ళ­నా­డు, కేరళ పో­టీ­ప­డు­తు­న్నా­య­ని చె­ప్పా­రు. రం­గా­రె­డ్డి జి­ల్లా మహే­శ్వ­రం­లో ఇం­డ­స్ట్రి­య­ల్‌ పా­ర్కు, ‘మల­బా­ర్‌ జె­మ్స్‌ అం­డ్‌ జ్యు­వె­ల­రీ’ తయా­రీ యూ­ని­ట్‌­ను మం­త్రి శ్రీ­ధ­ర్‌­బా­బు­తో కలి­సి సీఎం రే­వం­త్‌­రె­డ్డి ప్రా­రం­భిం­చా­రు. ‘‘పె­ట్టు­బ­డు­ల­ను ఆక­ర్షిం­చ­డం­లో తె­లం­గాణ ముం­దుం­ది. హై­ద­రా­బా­ద్‌­కు దే­శం­లో మరే నగ­రం­తో­నూ పోటీ లేదు.. ప్ర­పంచ నగ­రా­ల­తో­నే పోటీ. రా­ను­న్న వం­దే­ళ్ల­ను దృ­ష్టి­లో పె­ట్టు­కు­ని వి­జ­న్‌-2047 ప్ర­ణా­ళి­క­ను రూ­పొం­దిం­చు­కు­న్నాం. నగర అభి­వృ­ద్ధి కోసం దేశ, వి­దే­శా­ల­కు చెం­దిన కన్స­ల్టెం­ట్స్‌ పని­చే­స్తు­న్నా­యి. పె­ట్టు­బ­డి­దా­రు­ల­కు రక్షణ కల్పిం­చి వారి వ్యా­పా­రం లా­భా­ల్లో సా­గే­లా సహ­క­రి­స్తు­న్నాం’’అని సీఎం తె­లి­పా­రు.

ప్రపంచ నగరాలతోనే హైదరాబాద్​కు పోటీ

పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ముందుందని రేవంత్ రెడ్డి వివరించారు. హైదరాబాద్‌ నగరానికి దేశంలో మరే నగరంతోనూ పోటీ లేదన్నారు. ప్రపంచ నగరాలతోనే పోటీ అని సీఎం అభివర్ణించారు. రానున్న 100 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని విజన్‌-2047 ప్రణాళికను రూపొందించుకున్నామన్నారు. హైదరాబాద్​ నగర అభివృద్ధి కోసం దేశ, విదేశాలకు చెందిన కన్సల్టెంట్స్‌ పనిచేస్తున్నాయని తెలిపారు. పెట్టుబడిదారులకు రక్షణ కల్పించి వారి వ్యాపారం లాభాల్లో సాగేలా సహకరిస్తున్నామని రేవంత్ రెడ్డి వివరించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే మా అజెండా అనీ, పదేళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థలను చక్కదిద్దుతున్నామని తెలిపారు.

తయారీ రంగంలో ఎక్కువగా అభివృద్ధి

అం­త­కు­ముం­దు మం­త్రి శ్రీ­ధ­ర్‌­బా­బు మా­ట్లా­డు­తూ తె­లం­గా­ణ­లో తయా­రీ రంగం(మా­న్యు­ఫ్యా­క్చ­రిం­గ్) అభి­వృ­ద్ధి ఎక్కు­వ­గా ఉం­ద­ని 9 శా­తా­ని­కి పైగా వృ­ద్ధి సా­ధి­స్తోం­ద­ని వి­వ­రిం­చా­రు. గ్రీ­న్‌ ఇం­డ­స్ట్రి­య­ల్‌, నూతన ఎం­ఎ­స్‌­ఎంఈ పా­ల­సీ-2025ను ప్ర­భు­త్వం ఆమో­దిం­చిం­ద­ని శ్రీ­ధ­ర్​­బా­బు వి­వ­రిం­చా­రు. రా­ష్ట్రం­లో కొ­త్త ఇం­డ­స్ట్రీల ఏర్పా­టు­కు 4,200 దర­ఖా­స్తు­లు వచ్చా­య­ని వచ్చా­య­ని మం­త్రి వె­ల్ల­డిం­చా­రు. 15 రో­జు­ల్లో­నే 98 శాతం దర­ఖా­స్తు­ల­ను పరి­ష్క­రి­స్తు­న్నా­మ­ని శ్రీ­ధ­ర్​­బా­బు తె­లి­పా­రు. సిం­గి­ల్‌ విం­డో వి­ధా­నం­లో పా­ర­ద­ర్శ­కం­గా, వే­గం­గా అను­మ­తు­లు ఇస్తు­న్నా­మ­ని చె­ప్పా­రు. శాం­తి­భ­ద్ర­తల పరి­ర­క్ష­ణ­లో తె­లం­గాణ పో­లీ­సు­లు దే­శం­లో­నే ముం­దు­న్నా­ర­ని సీఎం రే­వం­త్​ రె­డ్డి హర్షం వ్య­క్తం చే­శా­రు. ఇటీ­వల తె­లం­గాణ పో­లీ­సు­లు జా­తీయ స్థా­యి­లో అవా­ర్డు­లు కూడా అం­దు­కు­న్నా­ర­ని ఆనం­దిం­చా­రు. డ్ర­గ్స్​, నే­రాల ని­యం­త్ర­ణ­లో తె­లం­గాణ పో­లీ­సు­లు ముం­దు­న్నా­ర­ని, సై­బ­ర్ నే­రాల ని­వా­రణ, సొ­మ్ము రి­క­వ­రీ­లో తె­లం­గాణ పో­లీ­సుల పని­తీ­రు నం­బ­ర్​­వ­న్​ అని సం­తో­షిం­చా­రు. ఇటీ­వల రా­ష్ట్ర ప్ర­భు­త్వం ని­ర్వ­హిం­చిన భా­ర­త్​ సమ్మి­ట్​­లో 100 దే­శాల ప్ర­తి­ని­ధు­లు పా­ల్గొ­న్నా­ర­ని తె­లి­పా­రు.

Tags:    

Similar News