REVANTH: ఆ చెత్తగాళ్ల వెనుక నేనెందుకు ఉంటా..?

తనకు అంత సమయం లేదన్న రేవంత్‌రెడ్డి.. కవిత ఆరోపణలపై స్పందించిన రేవంత్... టీడీపీపైనా కేసీఆర్ కుట్రలు చేశారని వెల్లడి

Update: 2025-09-04 04:30 GMT

తె­లు­గు­దే­శం లాం­టి అద్భు­త­మైన పా­ర్టీ మీద మాజీ ము­ఖ్య­మం­త్రి, బీ­ఆ­ర్ఎ­స్ అధి­నేత కే­సీ­ఆ­ర్ కు­ట్ర చే­శా­ర­ని సీఎం రే­వం­త్ రె­డ్డి ఆరో­పిం­చా­రు. కే­సీ­ఆ­ర్ కు­ట్ర వల్లే తె­లం­గా­ణ­లో నేడు టీ­డీ­పీ మను­గ­డ­లో లే­కుం­డా పో­యిం­ద­ని చె­ప్పా­రు. ప్ర­కృ­తి అనే­ది ఉం­టుం­ద­ని, అది తప్ప­కుం­డా శి­క్షి­స్తుం­ద­ని హె­చ్చ­రిం­చా­రు. ఇన్ని దు­ర్మా­ర్గా­లు చే­సిన బీ­ఆ­ర్ఎ­స్ తె­లం­గా­ణ­లో మను­గడ సా­గిం­చ­లే­ద­ని చె­ప్పా­రు. బీ­ఆ­ర్ఎ­స్ పా­ర్టీ త్వ­ర­లో­నే కా­ల­గ­ర్భం­లో కలి­సి­పో­తుం­ద­ని జో­స్యం చె­ప్పా­రు. హరీ­శ్, సం­తో­ష్ వె­నుక రే­వం­త్ రె­డ్డి ఉన్నా­ర­న్న కల్వ­కుం­ట్ల కవిత వ్యా­ఖ్య­ల­పై సీఎం రే­వం­త్ రె­డ్డి స్పం­దిం­చా­రు. అలాం­టి చె­త్త­గా­ళ్ల వె­నుక తా­నెం­దు­కు ఉం­టా­న­ని తనకు అంత సమయం లే­ద­ని సీఎం రే­వం­త్ రె­డ్డి బీ­ఆ­ర్ఎ­స్ పరి­ణా­మా­ల­పై వ్యా­ఖ్యా­నిం­చా­రు. ఒక­రి­పై ఒకరు యా­సి­డ్ దా­డు­లు చే­సు­కుం­టు­న్నా­ర­న్నా­ర­ని వి­మ­ర్శిం­చా­రు. పా­ల­మూ­రు జి­ల్లా పర్య­ట­న­లో ఉన్న సీఎం రే­వం­త్.. మూ­సా­పేట మం­డ­లం వే­ము­ల­ప­ల్లి­లో ఫా­ర్మా కం­పె­నీ ప్రా­రం­భిం­చా­రు. అనం­త­రం మా­ట్లా­డిన రే­వం­త్ సూ­టి­గా­నే బీ­ఆ­ర్ఎ­స్ అధి­నేత ఫ్యా­మి­లీ­లో ఏర్ప­డిన వి­వా­దం వి­మ­ర్శ­లు గు­ప్పిం­చా­రు. కాం­గ్రె­స్ పా­ర్టీ­ని బత­క­ని­వ్వ­బో­మ­ని ఆనా­డు అక్రమ కే­సు­లు పె­ట్టి జై­ల్లో పె­ట్టా­ర­ని గు­ర్తు చే­సు­కు­న్నా­రు. ఇవాళ వా­ళ్ళే­త­న్ను­కు­ని చస్తు­న్నా­రు.. ఒక­రి­నొ­క­రు కడు­పు­లో కత్తు­లు పె­ట్టు­కు­ని కౌ­గి­లిం­చు­కుం­టు­న్నా­ర­ని అన్నా­రు. ఎవరూ అక్క­ర్లే­దు వా­ళ్ల­ను వా­ళ్ళే పొ­డు­చు­కుం­టా­ర­న్నా­ర­ని తే­ల్చే­శా­రు.

నేను ముందే ఉంటా..

అవి­నీ­తి సొ­మ్ము పం­ప­కా­ల్లో తేడా వచ్చి కు­టుం­బం­లో తగా­దా­లు పె­ట్టు­కుం­టు­న్నా­ర­ని సీఎం రే­వం­త్ రె­డ్డి ఆరో­పిం­చా­రు. కే­సీ­ఆ­ర్ చే­సిన పాపం ఊరి­కే పో­ద­న్నా­రు. ఆ పా­పా­లు వెం­టా­డు­తూ­నే ఉం­టా­య­ని.. కచ్చి­తం­గా అను­భ­విం­చా­ల్సిం­దే­న­ని స్ప­ష్టం చే­శా­రు. ఒక­రి­వె­నక ఒకరు ఉన్నా­ర­ని కొం­ద­రు మా­ట్లా­డు­తు­న్నా­రు ..అంత చె­త్త­గా­ళ్ళ వెనక నే­నెం­దు­కు ఉం­టా­న­న­ని ప్ర­శ్నిం­చా­రు. నేను నా­య­కు­డి­ని.. ఉంటే ముం­దుం­టా… నా వా­ళ్ల­కు తో­డు­గా ఉం­టా­న­ని ప్ర­క­టిం­చా­రు. వా­ళ్ళ కు­టుం­బం­లో వా­ళ్లు వా­ళ్లు కత్తు­ల­తో పొ­డు­చు­కు­ని హరీ­ష్, సం­తో­ష్ వెనక రే­వం­త్ రె­డ్డి ఉన్నా­ర­ని ఒక­రం­టే… లేదు లేదు కవిత వె­న­కాల రే­వం­త్ రె­డ్డి ఉన్నా­ర­ని ఇం­కొ­క­రం­టు­న్నా­ర­ని వి­మ­ర్శ­లు గు­ప్పిం­చా­రు. బీఆర్ఎస్ నేతలు వాళ్లల్లో వాళ్లే విమర్శించుకుంటున్నారని.. దానికి కాంగ్రెస్తో ఏం సంబంధమని ప్రశ్నించారు.

ఇప్పటికే ప్రజలు బండకేసి కొట్టారు..

కే­సీ­ఆ­ర్ కు­టుం­బా­న్ని ఎప్పు­డో ప్ర­జ­లు బం­డ­కే­సి కొ­ట్టా­ర­ని, ఇన్నా­ళ్లూ కడు­పు­లో కత్తు­లు పె­ట్టు­కు­ని కౌ­గి­లిం­చు­కు­న్నా­ర­ని బీ­ఆ­ర్ఎ­స్ ఇంటి పో­రు­పై రే­వం­త్ స్పం­దిం­చా­రు. గతం­లో ఎవ­రి­నీ ఎద­గ­నీ­య­ని వా­ళ్లు ఇప్పు­డు వా­ళ్ల­లో వా­ళ్లే పం­చా­య­తీ పె­ట్టు­కుం­టు­న్నా­ర­ని సీఎం రే­వం­త్ వ్యా­ఖ్యా­నిం­చా­రు. మీ­రం­తా ది­క్కు­మా­లి­న­వా­ర­ని తె­లం­గాణ ప్ర­జ­లు బం­డ­కే­సి కొ­ట్టా­ర­ని.. అన్నం తి­నే­వా­రు ఎవ­రై­నా మీ వెనక ఉం­టా­రా అని ప్ర­శ్నిం­చా­రు. దయ­చే­సి మీ కు­టుంబ పం­చా­య­తీ­లో­కో.. మీ కుల పం­చా­య­తీ­లో­కో మమ్మ­ల్ని లా­గ­వ­ద్ద­ని హె­చ్చ­రిం­చా­రు. మాకు ఎలాం­టి ఆస­క్తి లే­ద­ని స్ప­ష్టం చే­శా­రు. మి­మ్మ­ల్ని ఎప్పు­డో ప్ర­జ­లు తి­ర­స్క­రిం­చా­ర­న్నా­రు. మీది కాలం చె­ల్లిన నోటు లాం­టి­ది ఆ పా­ర్టీ అని కా­ల­గ­ర్భం­లో కలి­సి­పో­తుం­ద­ని స్ప­ష్టం చే­శా­రు. ప్ర­కృ­తి ఉం­టుం­ది..ప్ర­కృ­తి శి­క్షి­స్తుం­ద­ని స్ప­ష్టం చే­శా­రు. అవి­నీ­తి ద్వా­రా సం­పా­దిం­చిన డబ్బు­ను పం­చు­కో­వ­డం­లో తలె­త్తిన వి­భే­దా­లే వారి మధ్య ఘర్ష­ణ­ల­కు కా­ర­ణ­మ­వు­తు­న్నా­య­ని ఆరో­పిం­చా­రు. 

టీడీపీ కనుమరుగుకు కారణం కాదా..?

నాకు కల్వ­కుం­ట్ల కు­టుంబ వి­వా­దాల వె­నుక ఉండే అంత సమ­యం­లే­ద­ని… ఇంత పని­కి­మా­నో­ళ్ల వె­నుక నే­నెం­దు­కు ఉం­టా­న­న్నా­న­ని రే­వం­త్ రె­డ్డి ప్ర­శ్నిం­చా­రు. జరు­గు­తు­న్న పరి­ణ­మా­లు అం­ద­రి­కి తె­లు­సు..మీ వి­వా­దం­లో­కి మీ కు­టుంబ, కుల పం­చా­య­తీ­ల­లో­కి మమ్మ­ల్ని లా­గ­కం­డ­ని హి­త­వు పలి­కా­రు. మీ కు­టుంబ పం­చా­య­తీ­పై మాకు ఎలాం­టి ఆస­క్తి లే­ద­ని..మీ­మ్మి­ల్ని ఎప్ప­డో ప్ర­జ­లు తి­ర­స్క­రిం­చా­ర­ని కల్వ­కుం­ట్ల కు­టుం­బా­ని­కి స్ప­ష్టం చే­శా­రు. మీరు కాలం చె­ల్లిన 1000నోటు లాం­టో­ళ్లు..కాల గర్బం­లో ఆ పా­ర్టీ కలి­సి­పో­తుం­ద­న్నా­రు. దే­శం­లో జనతా పా­ర్టీ, తె­లం­గా­ణ­లో టీ­డీ­పీ వంటి పా­ర్టీ­లే కను­మ­రు­గ­య్యా­య­ని.. ఇన్ని దు­ర్మా­ర్గు­లు చే­సిన మీరు మా­త్రం ఎలా మను­గడ సా­గి­స్తా­ర­ని రే­వం­త్ రె­డ్డి ప్ర­శ్నిం­చా­రు. పృ­కృ­తి అనే­ది ఉం­టుం­ది..అది శి­క్ష­స్తుం­ది..అం­దు­లో మనకు ఎలాం­టి ప్ర­మే­యం లే­ద­న్నా­రు. ఒక­ప్పు­డు ఏ పా­ర్టీ­ని బతు­క­ని­వ్వం..ఎవ­రి­ని ఎమ్మె­ల్యే­ల­ను కా­ని­వ్వ­మ­ని గతం­లో అక్రమ కే­సు­లు పె­ట్టి ఎం­ద­రి­నో జై­ళ్ల­కు పం­పిం­చి­నో­ళ్లు..ఇప్పు­డు వా­ళ్ల­లో వా­ళ్లే తన్ను­కో­ని చస్తు­న్నా­ర­ని కే­సీ­ఆ­ర్ కు­టుం­బం­లో­ని పరి­ణా­మా­ల­పై రే­వం­త్ రె­డ్డి వి­మ­ర్శ­లు గు­ప్పిం­చా­రు. పా­పా­లు ఎక్క­డి పోవు..ఖచ్చిం­త­గా వెం­టా­డు­తుం­టా­యి.. వా­ళ్లు అను­భ­విం­చా­ల్సిం­దే­న­న్నా­రు. రా­జ­కీ­యా­ల­వై­పు చూ­డ­కుం­డా పా­ల­మూ­రు జి­ల్లా­ను అభి­వృ­ద్ది చే­సు­కుం­దా­మ­న్నా­రు.

Tags:    

Similar News