REVANTH: దళితుడు స్పీకర్‌గా ఉంటే అసెంబ్లీకి రారా..?

మాజీ సీఎం కేసీఆర్‌కు రేవంత్ సూటి ప్రశ్న... దళితులకు ఏం చేశారని నిలదీసిన సీఎం.. గాంధీ-అంబేద్కర్ రెండు కళ్లు అన్న రేవంత్

Update: 2026-04-14 10:00 GMT

రక్తం చిందకుండా యుద్ధాన్ని గెలవచ్చని మహాత్మాగాంధీ నిరూపిస్తే, ఆ గొప్ప దేశాన్ని అద్భుతంగా పరిపాలించి ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుపొచ్చవచ్చని నిరూపించింది డా.బిఆర్ అంబేద్కర్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వడం ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి వైపు నడపవచ్చని చెప్పిన మార్గదర్శి, ప్రపంచ మేధావి అంబేద్కర్ అన్నారు. ఈ దేశానికి రెండు కళ్లలో ఒకటి మహాత్మగాంధీ అయితే మరో కన్ను డా.బిఆర్ అంబేద్కర్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇవాళ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి మంత్రులతో కలిసి సీఎం పూలమాల వేసి నివాళి అర్పించారు. సీఎం రే­వం­త్ రె­డ్డి తమ ప్ర­భు­త్వం దళి­తు­ల­కు ప్ర­త్యేక గు­ర్తిం­పు ఇస్తోం­ద­ని స్ప­ష్టం చే­శా­రు. మం­త్రి సీ­త­క్క, స్పీ­క­ర్ గడ్డం ప్ర­సా­ద్ వంటి నా­య­కు­ల­కు కీలక పద­వు­లు ఇచ్చి ఈ వి­ష­యా­న్ని ని­రూ­పిం­చా­రు. ఇలాం­టి ని­ర్ణ­యా­లు దళిత సమా­జం­లో నమ్మ­కం పెం­చా­యి. హై­ద­రా­బా­ద్‌­లో­ని దళిత కా­ల­నీ­ల్లో ని­వ­సిం­చే ప్ర­జ­లు ఇప్పు­డు తమ ప్ర­తి­ని­ధు­లు ప్ర­భు­త్వం­లో ఉన్నా­ర­ని గర్వం­గా చె­ప్పు­కుం­టు­న్నా­రు. భట్టి వి­క్ర­మా­ర్క దళిత నా­య­కు­డి­గా ప్ర­జల మధ్య మంచి ఆదరణ పొం­దు­తు­న్నా­రు. వారి నా­య­క­త్వం­లో అమ­ల­వు­తు­న్న సం­క్షేమ పథ­కా­లు తె­లం­గాణ గ్రా­మా­ల్లో­ని సా­మా­న్యు­ల­కు మేలు చే­స్తు­న్నా­యని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు.

“స్పీ­క­ర్‌­ని అధ్య­క్షా అని పి­ల­వ­డం కూడా ఇష్టం లేని కొం­త­మం­ది సభకు రా­వ­ట్లే­దు. ఇది దళి­తు­ల్ని అవ­మా­నిం­చ­డ­మే” అని ఆరో­పిం­చా­రు. ఈ వ్యా­ఖ్య­లు అసెం­బ్లీ­లో జరు­గు­తు­న్న రా­జ­కీయ పరి­ణా­మా­ల­ను ప్ర­తి­బిం­బి­స్తా­యి. దళిత నా­య­కు­డైన స్పీ­క­ర్‌­కు గౌ­ర­వం ఇవ్వ­డం సా­మా­జిక న్యా­యా­ని­కి అవ­స­ర­మ­ని సీఎం అన్నా­రు. తె­లం­గాణ వచ్చిన మొ­ద­టి పదే­ళ్ల­లో ఉద్య­మం­లో ముం­దు­న్న వారి పరి­స్థి­తి ఎలా ఉంది? గద్ద­ర్, అం­దె­శ్రీ లాం­టి వారి పరి­స్థి­తి ఎలా ఉం­ద­ని ఆలో­చిం­చా­ల­న్నా­రు. గత పా­ల­కు­లు ఎన్ని­క­ల్లో ఏదే­దో హా­మీ­లు ఇచ్చా­రు. కానీ మం­త్రి­వ­ర్గం­లో దళి­తు­లు, గి­రి­జ­ను­ల­కు వా­రి­చ్చిన ఇచ్చిన స్థా­నం ఏంటో ఒక్క­సా­రి ఆలో­చన చే­యా­ల­న్నా­రు. ఆనా­డు మం­త్రి వర్గం­లో ఏ జా­తి­కి ఎంత స్థా­నం ఉంది? ఈనా­డు మం­త్రి వర్గం­లో ఎంత స్థా­నం ఉందో మీరే లె­క్క చె­ప్పా­ల­న్నా­రు. ఒక స్పీ­క­ర్‍తో పాటు నలు­గు­రు మం­త్రు­లు, వి­ప్‍ల­లో దళి­తు­లు, గి­రి­జ­ను­ల­కు ఇం­త­టి ప్రా­తి­ని­థ్యం ఉమ్మ­డి రా­ష్ట్రం­లో­నై­నా దక్క­లే­ద­న్నా­రు. భట్టి వి­క్ర­మా­ర్క సీ­ఎ­ల్పీ లీ­డ­ర్‍గా ఉంటే ఓర్వ­లేక అవ­మా­న­కర రీ­తి­లో అత­డి­ని తొ­ల­గిం­చిన చరి­త్ర మన కళ్ల­ముం­దే ఉం­ద­న్నా­రు.

Tags:    

Similar News