తెలంగాణలో కొత్తగా ఇళ్లు నిర్మించుకుని విద్యుత్ మీటర్ బిగించుకోనివారికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొత్త మీటరు కావాలంటే రూ.825కే మీటర్లు ఏర్పాటు చేయనుంది. సెప్టెంబర్ 15 వరకు సిబ్బంది గ్రామాల్లో తిరిగి మీటర్లు లేని పేదలను గుర్తిస్తారు.
సాధారణంగా మీటర్ల కోసం మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. కానీ ప్రస్తుతం సిబ్బందికి డబ్బులిస్తే నేరుగా రశీదు తీసుకునే వెసులుబాటు ఉంది. వారు గృహజ్యోతి కోసం ఈ నెల 17న మొదలయ్యే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.