Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురు దుర్మరణం
Road Accident: మేడారం వెళ్తుండగా ప్రమాదం జరిగిందన్న పోలీసులు;
Road Accident: ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గట్టమ్మ ఆలయం వద్ద ఎదురెదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు - కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా వాజేడు మండలం చంద్రుపట్ల వాసులుగా గుర్తించారు. మేడారం వెళ్తుండగా ఘటన జరిగిందని పోలీసులు వివరించారు. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జుకాగా మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోయాయి. అతి కష్టం మీద మృతదేహాలను బయటకు తీశారు. బస్సు ముందు భాగం కొంత మేర దెబ్బతింది.
ప్రమాదం జరిగిన ఏరియా మేడారం జాతరకు వెళ్లే మార్గం కావడంతో కొద్దిసేపటిలోనే భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై క్రేన్ సహాయంతో కారును రోడ్డు పక్కకు తరలించారు. మార్గంలో రాకపోకలను పునరుద్ధరించారు.