Hyderabad : రూ.10 కాయిన్స్​ చట్టబద్ధమైనవే : రాజేశ్వర్ రెడ్డి

Update: 2024-10-22 13:15 GMT

పది రూపాయల కాయిన్స్​ చట్టబద్ధమైనవేనని, వాటిపై ఉన్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మకూడదని ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. వ్యాపార లావాదేవీలకు వాటిని ఉపయోగించాలని సూచించారు. ఈ మేరకు ఆర్బీఐ ఉత్తర్వుల మేరకు విస్తృత అవగాహన కల్పించేందుకు ఇండియన్ బ్యాంక్ చర్యలు చేపడుతోందని వివరించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ బ్రాంచ్ వద్ద10 రూపాయల నాణేలు చలామణి పై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తమ ఖాతాదారులకు10 రూపాయల నాణేలు వినియోగించాలని సూచిస్తున్నామని... ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో ఈ నాణేలు చెల్లుబాటు అవుతున్నాయన్నారు. ఈ సందర్భంగా పలువురు ఖాతాదారులు ఈ నాణేలను జీఎం చేతుల మీదుగా అందుకున్నారు.

Tags:    

Similar News