TG : ఆర్టీసీ గుడ్ న్యూస్.. బస్సుల్లో టికెట్ కోసం యూపీఐ, స్మార్ట్ సేవలు

Update: 2024-12-12 13:15 GMT

ఆర్టీసీ ప్రయాణికులు ఇకపై డిజిటల్‌ పేమెంట్స్‌తో ప్రయాణం చేసే అవకాశం అందుబాటులోకి రానుంది. ఆన్‌లైన్‌ పేమెంట్స్‌పై సంస్థ యాజమాన్యం అన్ని సిద్ధం చేసింది. ఆన్ లైన్ చెల్లింపులు జరిపేందుకు ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ AFCS మెషీన్లు ఇప్పటికే సంస్థకు చేరాయి. కొన్ని నెలల కింద వీటికోసం ఆర్టీసీ ఆర్డర్ పెట్టగా ఇటీవలే ఈ ఆన్‌లైన్ పేమెంట్ మెషీన్లు సంస్థ చేతికి వచ్చాయి. ఇక త్వరలోనే ప్రయాణికులు అన్ని రకాల బస్సుల్లో ఆన్‌లైన్ పేమెంట్ చేసే వీలు ఉంటుంది. దీంతో ఇక ఆర్టీసీలో ప్రయాణికులకు నగదు, చిల్లర సమస్య తీరనుంది. ఫోన్ చేతిలో ఉంటే చాలు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, వాట్సాప్ పేమెంట్ ద్వారా టికెట్‌కు సరిపడా చెల్లింపులు చేసే వీలుంది. వీటితోపాటు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కూడా చెల్లింపులకు అవకాశం ఉండనుంది. ప్రస్తుతం ఈ మెషీన్ల పనితీరును అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పుడు 6 వేల మెషీన్లు అందుబాటులో ఉండడంతో మొదటి దశలో హైదరాబాద్ మెట్రో పరిధిలో వీటిని వినియోగించి, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఆర్టీసీ అధికారులు ఉన్నారు.

Tags:    

Similar News