జనగామ జిల్లాలోని కొడకండ్లలో నిర్మించిన రైతు వేదికను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సీఎం కేసీఆర్ కు మంత్రులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వేద పండితులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. రైతు వేదిక శిలా ఫలకం వద్ద పూజలు చేశారు. అనంతరం రిబన్ కట్ చేసి రైతు వేదికను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. రైతు వేదికను ఆయన పరిశీలించారు. అక్కడి నుంచి పల్లె ప్రకృతి వనానికి చేరుకుని సందర్శించారు. రైతు ఆత్మీయ సమ్మేళనంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.