వికారాబాద్ జిల్లా పరిగి సబ్ జైలు ముందు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధర్నా చేపట్టారు. లగచర్ల ఘటనపై జైలులో ఉన్న 20 మంది రైతులతో సబిత ములాఖత్ అయ్యారు. అనంతరం రైతుల కుటుంబ సబ్యులతో కలిసి జైలు ముందు బైఠాయించారు. లగచర్ల ఘటనలో లేని రైతులను అన్యాయంగా అరెస్ట్ చేసి జైలులో పెట్టారని మండిపడ్డారు. ఐతే.. సబిత పర్యటన సందర్భంగా కొంత నిరసన వ్యక్తమైనట్టు పలు వార్తలు వెలువడ్డాయి