TG : సీఎం రేవంత్‌కు సబితా ఇంద్రారెడ్డి సవాల్

Update: 2024-10-04 11:00 GMT

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా తనను ఎంతగా టార్గెట్ చేసినా ప్రజల తరఫున ప్రశ్నించడం మాత్రం ఆపేది లేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సబితా ఇంద్రారెడ్డి తనయుల ఫామ్ హౌస్‌లు కూల్చాలా? వద్దా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారని, కానీ అవి ఎక్కడ ఉన్నాయో చూపించాలన్నారు. మా అబ్బాయి కడుతున్న ఇల్లును మినహాయించి, మీరు చెప్పినట్లుగా మరో మూడు ఫామ్ హౌస్‌లు మాకు ఎక్కడ ఉన్నాయో బయటపెట్టాలని సవాల్ చేశారు. ముఖ్యమంత్రి మాట తీరును తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు. ఆత్మాభిమానం కంటే మించిన ఆస్తి లేదని గుర్తించాలన్నారు. సీఎం ముందు లేదా ఇంకెవరి వ్యక్తుల ముందైనా పేద ఏడుపులు ఏడ్చే పరిస్థితిని తనకు దేవుడు కల్పించలేదన్నారు.

Tags:    

Similar News