హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాలు ధూంధాంగా జరుగుతున్నాయి. ఖైరతాబాద్, సైదాబాద్, నాగోల్ లో దున్నపోతుల విన్యాసాలతో సందడిగా మారింది. దేశంలో ఉన్న మేలిమి జాతీ దున్నపోతుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఖైరతాబాద్‌లో జరిగిన వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
సదర్ వేడకులకు ఎంతో ప్రత్యేక ఉందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కులమతాలకు అతీతంగా ఖైరతాబాద్ సదర్ ఉత్సవాలు జరుగుతాయన్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగలా నిర్వహిస్తామన్నారు.