ప్రతి ఏడాది జరిపినట్లే ఈసారి కూడా సదర్ సమ్మేళన్ నిర్వహిస్తున్నట్టు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. అక్టోబర్ 27వ తేదీన ఎన్టీఆర్ గ్రౌండ్ దగ్గర సదర్ సమ్మేళన్ జరుగుతుందని యాదవ్ తెలిపారు. ఈ సారి వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తర ప్రదేశ్ నేతలు తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్ సహా తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. కులమతాలకు అతీతంగా సదర్ సమ్మేళన్‌ను జరుపుకోవాలని కోరారు. తెలంగాణ అంతటా సదర్ వేడుకలు జరుపుకోవాలని చెప్పారు. టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం విభిన్న సంసృతి, సంప్రదాయాలకు నిలయమని చెప్పారు. సదర్ సమ్మేళన్‌కు నలుమూల ఉన్న ప్రజలు హాజరవుతారని అంజన్ కుమార్ యాదవ్ వివరించారు. ఏకేవై టీం ఆధ్వర్యంలో అంతా జరుగుతుందని, ధనక్ ధనక్ తురే అనే శబ్దంతో కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు.