SADAR: యాదవుల సాంస్కృతిక ప్రతీక.. సందర్ ఉత్సవ్

సదర్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి.. యాదవులకు సముచిత స్థానం ఇస్తామని వెల్లడి.. సదర్‌ను రాష్ట్ర పండుగగా గుర్తించామన్న రేవంత్‌

Update: 2025-10-20 04:00 GMT

అల­నా­టి సమా­జం­లో వారి వృ­త్తే వా­రి­కి గు­ర్తిం­పు, వారి జీవన వి­ధా­నం­లో భా­గ­మైన పను­లే వారి పం­డు­గ­లు, అవే నే­టి­కీ వారి సాం­స్కృ­తిక ప్ర­తీ­క­లు. అటు­వం­టి­వే నేటి సదర్ ఉత్స­వా­లు. భి­న్న సం­స్కృ­తి,సం­ప్ర­దా­యా­ల­కు ని­ల­యం హై­ద­రా­బా­ద్ నగరం. ఏటా సరి­గ్గా దీ­పా­వ­ళి సమ­యా­ని­కి జం­ట­న­గ­రా­లు సదర్ ఉత్స­వా­లు జరు­పు­కో­వ­డా­ని­కి ము­స్తా­బ­వు­తా­యి. దీ­న్నే వృ­ష­భో­త్స­వం అని కూడా అం­టా­రు. సదర్ అనే ఉర్దూ పదా­ని­కి ఆత్మ వి­శ్వా­సం, లీ­డ­ర్ అనే అర్థా­లు ఉన్నా­యి. సదర్ అంటే హై­ద­రా­బా­దీ వ్య­వ­హా­రి­కం ప్ర­కా­రం ప్ర­ధా­న­మై­న­ది అని అర్థం. యాదవ సా­మా­జిక వర్గం అత్యంత వై­భ­వం­గా ని­ర్వ­హిం­చే ఈ సదర్ ఉత్స­వాల ని­ర్వ­హణ వె­నుక పె­ద్ద చరి­త్రే ఉంది. ఈ ఉత్స­వా­లు ఐదు వేల సం­వ­త్స­రాల క్రి­తం నాటి సిం­ధు నా­గ­రి­క­త­లో భా­గం­గా ప్రా­రం­భ­మై దే­శ­వ్యా­ప్తం­గా వి­స్త­రిం­చి­న­ప్ప­టి­కి, తర్వా­తి కా­లం­లో కను­మ­రు­గై స్థా­నిక ప్రాం­తా­ల­కు మా­త్ర­మే పరి­మి­త­మై­నా­యి.


అభి­వృ­ద్ధి, సం­క్షే­మం, రా­జ­కీయ ప్రా­తి­ని­థ్యం­లో యా­ద­వు­ల­కు సము­చిత స్థా­నం కల్పి­స్తా­మ­ని సీఎం రే­వం­త్‌­రె­డ్డి హామీ ఇచ్చా­రు. హై­ద­రా­బా­ద్‌ ఎన్టీ­ఆ­ర్‌ స్టే­డి­యం­లో సద­ర్‌ ఉత్స­వా­న్ని సీఎం ప్రా­రం­భిం­చా­రు. పదే­ళ్లు అధి­కా­రం­లో ఉన్న భారత రా­ష్ట్ర సమి­తి ప్ర­భు­త్వం.. సద­ర్‌ ఉత్స­వా­న్ని రా­ష్ట్ర పం­డు­గ­గా గు­ర్తిం­చ­లే­ద­న్నా­రు. కాం­గ్రె­స్‌ వచ్చాక సద­ర్‌ ఉత్స­వా­న్ని రా­ష్ట్ర పం­డు­గ­గా గు­ర్తిం­చా­మ­ని పే­ర్కొ­న్నా­రు. కాం­గ్రె­స్‌ పా­ర్టీ యా­ద­వు­ల­కు రా­జ­కీయ అవ­కా­శా­లు కల్పిం­చిం­ద­ని సీఎం తె­లి­పా­రు. తె­లం­గాణ రా­ష్ట్రం­లో ఏర్ప­డిన ప్ర­భు­త్వం­లో యా­ద­వు­ల­ది అత్యంత కీ­ల­క­మైన పా­త్ర అన్నా­రు. వా­రి­కి మరి­న్ని అవ­కా­శాల కోసం పా­ర్టీ పె­ద్దల దృ­ష్టి­కి తె­స్తా­మ­ని వి­వ­రిం­చా­రు. హై­ద­రా­బా­ద్‌ అభి­వృ­ద్ధి­కి యా­ద­వుల సహ­కా­రం కా­వా­ల­ని కో­రా­రు. ఈ కా­ర్య­క్ర­మం­లో మం­త్రు­లు పొం­గు­లే­టి శ్రీ­ని­వా­స్‌­రె­డ్డి, పొ­న్నం ప్ర­భా­క­ర్‌, వా­కి­టి శ్రీ­హ­రి, హరి­యా­ణా మాజీ గవ­ర్న­ర్‌ బం­డా­రు దత్తా­త్రేయ, భా­జ­పా రా­ష్ట్ర అధ్య­క్షు­డు ఎన్‌.రా­మ­చం­ద­ర్‌­రా­వు తది­త­రు­లు పా­ల్గొ­న్నా­రు. ఆధు­నిక సదర్ ఉత్స­వా­లు మా­త్రం 1946 నుం­చి స్వ­ర్గీయ చౌ­ద­రి మల్ల­య్య యా­ద­వ్, నా­రా­యణ గూడ వై­ఎం­సీ­లో ప్రా­రం­భిం­చి­న­ట్లు తె­లు­స్తోం­ది. కా­ల­క్ర­మే­ణా హై­ద­రా­బా­ద్‌­లో­ని అనేక ఇతర ప్రాం­తా­ల­లో ని­ర్వ­హి­స్తు­న్న­ప్ప­టి­కీ, నా­రా­య­ణ­గూడ వై­ఎం­సీ సదర్ ఉత్స­వం చరి­త్ర, ప్ర­జా­ద­రణ కా­ర­ణం­గా దీ­ని­ని పె­ద్ద సదర్ అం­టా­రు.

Tags:    

Similar News