Hyderabad : పాపం.. జాబ్లో జాయిన్ అయిన ఫస్ట్ డేనే చనిపోయాడు!

Update: 2025-03-20 16:15 GMT

హైదారాబాద్ లో మరో దారుణం జరిగింది. హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో యువ ఇంజనీర్ నవీన్ చారి ప్రాణాలు కోల్పోయాడు. ఉద్యోగంలో చేరిన మొదటి రోజు ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో నవీన్ చారీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతన్ని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు నవీన్ చారిని అత్యవసర చికిత్సకు తీసుకెళ్లినప్పటికీ అతన్ని కాపాడలేకపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవీన్ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఎన్నో ఆశలతో ఉద్యోగంలో చేరిన నవీన్ చనిపోవడం అందర్నీ దిగ్భ్రాంతిని గురిచేసింది.

Tags:    

Similar News