Nirmal: సర్పంచ్ ను చెప్పుతో కొట్టిన ఉప సర్పంచ్ శారద..
Nirmal: నిర్మల్ జిల్లా భైంసా మండలం మహాగామ్ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.;
Nirmal: నిర్మల్ జిల్లా భైంసా మండలం మహాగామ్ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్పంచ్ అప్పాల రాకేష్‌పై ఉప సర్పంచ్ శారద.. చెప్పుతో దాడి చేయడంతో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. కొట్లాటకు దిగడంతో పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు.
కొన్ని రోజులుగా గ్రామ పంచాయతీ నిధుల విషయంలో సర్పంచ్, ఉపసర్పంచ్‌కు మధ్య విభేదాలు ఉన్నాయి. నిధుల దుర్వినియోగంపై శారద కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో డీఎల్‌పీఓ శివరామ కృష్ణ విచారిస్తుండగా సర్పంచ్ రాకేష్‌పై, అక్కడ వీడియోలు తీస్తున్న పంచాయతీ సెక్రటరీ ప్రత్యూషపై కూడా శారద దాడి చేసింది. దీంతో రెండు వర్గాల మధ్య యుద్ధవాతావరణం తలపించింది