Secunderabad Fire Accident: నగరాన్ని చూద్దామని వచ్చారు.. రూబీ హోటల్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు..
Secunderabad Fire Accident: సికింద్రాబాద్ రూబీ హోటల్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఒడిశాలోని కటక్‌కు చెందిన ఓ మహిళ, ఆమె భర్త కూడా ఉన్నారు.;
Secunderabad Fire Accident: సికింద్రాబాద్ రూబీ హోటల్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఒడిశాలోని కటక్‌కు చెందిన ఓ మహిళ, ఆమె భర్త కూడా ఉన్నారు. సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది మృతి చెందినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
సికింద్రాబాద్‌లోని రూబీ లగ్జరీ ప్రైడ్ హోటల్‌లో సోమవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 8 మంది మృతి చెందగా, 10 మందికి తీవ్ర గాయాలై గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ దుర్ఘటనలో మృతి చెందిన కటక్ కాఫ్లా బజార్ ప్రాంతానికి చెందిన చందన్ జెథి, అతని భార్య మితాలీ మోహపాత్రగా గుర్తించారు. దంపతుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రిలో భద్రపరిచారు.
బెంగళూరులో నివసిస్తున్న చందర్, మితాలీలకు నవంబర్ 2, 2020న వివాహం జరిగింది. చందన్ సాప్ట్‌వేర్ ఇంజనీర్ కాగా, మితాలీ ఎగ్జిక్యూటివ్‌గా వర్క్ చేస్తున్నారు. వీరు నాలుగు రోజులు శెలవు తీసుకుని హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. రూబీ హోటల్‌లో చెలరేగిన మంటల కారణంగా అగ్నికి ఆహుతయ్యారు.
ఎలక్ట్రికల్ వెహికల్ బైక్ షోరూమ్‌లో చెలరేగిన మంటల కారణంగా నాలుగు అంతస్తుల రూబీ హోటల్‌కు అగ్నికీలలు చుట్టుముట్టాయి. మంటలకు తాళలేక బాధితుల ఆర్తనాదాలు మిన్నంటాయి.