Minister Seethakka : నాంపల్లి కోర్టుకు సీతక్క.. ఎందుకంటే..?

Update: 2025-07-24 11:15 GMT

మంత్రి సీతక్క నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. 2021, ఆగస్టు 26న కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద ఎన్ఎస్‌యూఐ నాయకులతో కలిసి ఆమె ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆరోగ్యశ్రీ కింద కోవిడ్‌కు చికిత్స అందజేయాలని, ఉచిత అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనాతో మరణించిన ప్రతి కుటుంబానికి వాళ్లు ఆసుపత్రిల్లో కట్టిన బిల్లులను చెల్లించాలని కోరారు. కానీ కోవిడ్ సమయంలో గుంపులుగా బయట తిరగొద్దని నిషేదాజ్ఞలు అమల్లో ఉన్నా.. ఆమరణ దీక్షలో పాల్గొన్నందుకు సీతక్కపై అప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన కేసు విచారణకు సీతక్క నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు.

Tags:    

Similar News