Seethakka: పోలీసు కస్టడీలో సీతక్క..
Seethakka: జీవో 317ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్‌ఎస్‌యూఐ.. హైదరాబాద్‌లో ఆందోళనకు దిగింది.;
Seethakka (tv5news.in)
Seethakka: జీవో 317ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్‌ఎస్‌యూఐ.. హైదరాబాద్‌లో ఆందోళనకు దిగింది. లిబర్టీ అంబేద్కర్ చౌక్ లో జరిగిన నిరసన కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పాల్గొన్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బల్మూరి వెంకట్‌ను ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు , సీతక్కను నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జీవో 317 ప్రకారం రికార్డు చేయబడ్డ ఆదివాసీ ఉద్యోగులకు స్థానికంగానే బదిలీల ప్రాధాన్యత కల్పించాలని సీతక్క డిమాండ్ చేశారు. రోస్టర్ విధానం పాటించకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు ప్రభుత్వం తూట్లు పొడిచిందని మండిపడ్డారు.