Bhongir: భువనగిరి పోలీస్ స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం.. సీజ్ చేసిన వాహనాలకు నిప్పు..
Bhongir: భువనగిరి పోలీస్ స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సీజ్ చేసి ఉంచిన వాహనాలకు ఆకతాయిలు నిప్పంటించారు;
Bhongir: భువనగిరి పోలీస్ స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సీజ్ చేసి ఉంచిన వాహనాలకు ఆకతాయిలు నిప్పంటించారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. వందలాది వాహనాలు తగలబడ్డాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో.. అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు తీశారు. పోలీస్ స్టేషన్... నివాస సముదాయాలకు ఆనుకుని ఉండటంతో స్థానికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపు చేశారు.